పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
114

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


ఆయనకన్న ముందే ఆయనకుమాళ్లును, మనుమలును మరణిం చినందున ఆయన తరువాత మునిమనుమడు, అయిదు సంవత్సముల యీడుగల పదునేనవ లూయీ రాజ్యమునకు వచ్చెను.

నానిష్ణుః
పృధివీపతిః"

పదునాల్గవ లూయీ రాజు ఫ్రాస్ సు దేశమును నిరంకు శముగ పాలించెను. “ నావిష్ణుః పృధివీపతిః అనగా రాజు దైవాంశ సంభూతుడు” అను సిద్ధాంతము నా యన సమ్మెను. ప్రజలను పాలించుటకు తనకు దైవము ప్రసాదించెననియు తాను దైవమునకు తప్ప మనుష్యుల కెవరికిని జవాబుదారూ కాసనియు ఆయన తలంచెను. ఆయన కాలమున స్టేట్సు జనరలు (దేశ ప్రతినిధిసభ') ను సమూ వేశ పఱచనే లేదు. రాజు యొక్క చిత్తమే చట్టము," " రాజు నకు సర్వాధికారము గలదు,” ఈ రాజున కడ్డుచెప్పువా రుండ గూడదు” అని ఆయన తలంపు. ఇట్టి అభిప్రాయములనే యిం గ్లాండును పాలించిన మొడటి జేమ్సు రాజు కలిగి యుండెను. ఆంగ్లేయ ప్రజ లెదిరించిరి. తమ ప్రతినిధి సభ యొక్క. ఆసుమతి లేనిది తమమీద పన్నులు వేయుటకు వీలు లేదనిరి. రాజు ఒప్పుకొనలేదు. ఆయన కుమారుడగు మొదటి చార్లెను కాలమున నీ పోరాటము హెచ్చెను. చార్లెసు తన యిచ్చ వచ్చిన పన్ను లను వేసి వసూలు చేయ దలచెను. ప్రజ లెదిరించిరి. తిరుగ బడిరి. రాజును దేశ ద్రోహపు నేరము క్రింద విచారించిరి. శిర ఛ్ఛేదము గావించిరి. ఇటుల ఇంగ్లాండు ప్రజలు రాజు యొక్క నిరంకుశత్వముతో పోరాడుచున్న కాలమున యూరపుఖండ మంతయు రాజుల నిరంకుశత్వము కింద పాలింపబడు చుండెను.