పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
110


ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

స్పెయిన్ తో
యుద్ధము

ఆయన చేసిన మొదటి యుద్ధము స్పెయిన్ దేశముతోనై యున్నది. 1665 వ సంవత్సరమున స్పెయిన్ రాజగు నాలుగవ ఫిలిపు చనిపోయెను. ఫిలిపుకు మొదటి కొమార్తె, కూతురు పదునాలుగవ లూయీ భార్య. రెండవ భార్య రెండవ కుమారుడు 'రెండవచార్లెసు. పదునాలుగవ లూయీ తన భార్యకు అచటి చట్టముల ప్రకారము స్పెయిన్ రాజ్యము క్రిం దనుండిన సెదరులాండ్సు రావలెననెను. రెండవ చార్లెసు కుమారు... యావత్తును తన కే రావ లెనె ననెను. రెండవ చార్లె సుకును ఫ్రాన్సు రాజునకును యుద్ధము జరిగెను. స్పెయిన్ రాజు మిగుల బలహీనుడుగ నుండెను. ఫ్రెంచి సైన్యములు, నెడర్లెం డ్సులో అడ్డు లేక జొరబడెను. విశేష భాగము నాక్రమించెసు. ఒక నెల పదునైదు దినములలో "ఫ్రెంచి కౌంటీ స్వాధీనమయ్యెను, దీనితో తక్కిన దేశముల వారికి కన్ను కుట్టెను. ఇంగ్లాండు, స్వీడను, హా లెrండు దేశముల వారు జోక్యము కలుగ జేసికొని సంధి కుదిర్చిరి. స్పెయిన్ రాజగు 'రెండవ చార్లెసు విశేషముగ వ్యాధిగ్రస్తుడై యుండెను. ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజ్యమంతయు వార సత్వముగ దనభార్య కే వచ్చునని పదునాలుగవ లూయీ తల చెను. తాను జయించిన దానిలో కొంత యుంచుకొని తక్కిన దానిని వదలి లూయి సంధి కంగీక రించెను.యుద్ధము ముగిసెను..

హాలండుతో
యుద్ధము.

హాలెండువారు తనకు వ్యతిరేకము ముగ నింగ్లాండులో కలిసివచ్చుటను పదునాలుగవలూయి సహించలే కుండెను. మరియు హాలెండువారు 'ఫ్రెంచివారికి విదేశ వర్తకములో ముఖ్యముగ పోటీగ సుండిరి.