పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109

ఎనిమిదవ అధ్యాయము

వేయననియు సైన్యములను పెట్టుకొనననియు విచారణ లేకుండ నెవరిని శిక్షించననియు నీయస వాగ్ధత్తముచేసి రాజయ్యెను. 'ఈ కల్లోలముల మధ్య చిక్కుకొని ఇంగ్లాండు దేశము, యూరపు వ్యవహారములలో విశేషముగ జోక్యముపుచ్చుకొను స్థితిలో లేదు. 'స్పెయిసు, ఆస్ట్రియా దేశములు మతయుద్ధముల వలని మిగుల బలహీనములయినవి. జర్మనీ ముప్పది సంవత్సరముల మత యుద్ధమువలన క్షీణించుటయేగాక యనేక ఖండములుగ చీలియున్నది. కావున పదునాల్గవ లూయి యూరపువ్య హారములలో ప్రవేశించి ఫ్రాన్సుకు ఇంక నెక్కువ గౌరవము తేవ లెననియు తాను విదేశములలో రాజ్యమును సంపాదించ వలెననియు తలచి, అనేక యుద్ధములలోనికి దిగెను. విశేష, భాగము జయముల నంది కొంత ప్రదేశమును సంపాదించెను, గాని ఈ యుద్ధముల వలనను దంభముగాను వైభవము తోను విశేషభోగ పరాయణత్వములోను తాను సంచరించుటలో కలి గిన దుర్వయముల వలనను ఫ్రాస్సు దేశమును మితి లేని ఋణ ములలో ముంచివేసెను. ఆగాయముకన్న ఖర్చులెక్కువై ఋణము లపరిమితముగ పెరిగెను. కాని, గొప్ప విద్యాపోషకు డనియు యూరఫుఖండములో కెల్ల కళలను, సాహిత్యమును, గా స్త్రములను, చిత్తరువులను వృద్ధి చేసినవాడనియు కీర్తిని సంపాదిం. చెను. ప్రజాప్రతినిధిసభలను పిలువక తన దేశమును నిరంకుశ ముగా పాలించినసు దేశములో శాంతిని, అభివృద్ధిని నెలకొలిపి ఎచట చూచినను ఫోన్సు దేశపు గొప్పదనమును స్థాపించిన వాడని పేరువడసెను.