పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రెంచిస్వాతంత్ర్యవిజయము


మొదటి అధ్యాయము

ఫ్రాన్సు దేశ మను పేరు


ఉపోద్ఘాతము

ప్రస్తుత కాలమున మానవ సంఘములను మహత్కార్యములకు పురికొలుపుచున్న భావములలో ముఖ్య నగునవి మూడు. మొదటిది జూతీయ భావము, ప్రతి దేశములోని ప్రజలందరును వారిలో వారి కెన్ని 'భేదములున్నను - ఓకే జాతీయనియు, ప్రతి జాతియుతన యదృష్టమును తనయభివృద్ధిని తన బాగోగులను తానే నిర్ణయించుకొనవ లేననియు నేను భావము. ఇది మొదటిది. రెండవది ప్రజాపాలనము. ప్రతి దేశములోని ప్రజలును. అదే శమును పరిపాలించుకొనుటకు హక్కు దారులనియు, ఆప్రజల యిష్టము లేనిది వారిపై రాజ్యాధికారము చలాయించుట కెవ రికిని హక్కు లేదనియు రెండవ భావము. మూడవది మానవ సమానత్వము. మానవులందరును పుట్టుక వలన సమానులని