పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ఫ్రెంచి స్వాతంత్య విజయము

ఫ్రాన్సు యొక్క
గొప్ప స్థితి


పదునాల్గపలూయి కాలమునకు యూరపులో కెల్ల ఫ్రా న్సు దేశమే అత్యుత్తమస్థితియందున్నది. ఇంగ్లాండు దేశములో , నాకాలమున ప్రజలకును రాజులకును గొప్పపోరాటములు జరుగుచుండెను. 1649 వ సంవత్సరమున మొదటి చార్లెసు రాజును ప్రజాప్రతినిధిసభ వారు విచారించి మరణదండన విధించిరి. రాజును తీసివేసి సంపూర్ణ ప్రజాస్వామ్యమును స్థాపించిరి. ప్రజానాయకుడగు - లివరు క్రాం వెలుసు సంరక్షకుడుగ నెన్ను కొనిరి. క్రాం వెలు 1658 వ సంవత్సరమున చనిపోయి నందున ఆంగ్లేయ ప్రజలను సరిగా నడుపు విశ్వాసపాత్రుడగు నాయకుడు లేకపోయెను. తుదకు చిరచ్ఛేదము గావింపబడిన చార్లెసు రాజు యొక్క 'కుమారుడగు రెండవ చార్లెసును రాజుగా తెచ్చుకొనిరి. రెండవ చార్లెసుసకును ఆంగ్లేయ ప్రజలకును కలహములే కలి గెను. రాజప్రతినిధి సభను సంప్రతించక యే తనయిచ్చవచ్చి నటుల నిరంకుశముగ పాలించెను. రాజునకును ప్రజా ప్రతినిధు లకును పోరాటములు జరుగుచుండగనే 1685 సంవత్సరమున చార్లెసు చనిపోయి, రెండవ జేస్సు రాజయ్యెను. 'జేమ్సు సకును ఆంగ్లేయ ప్రజలకును స్నేహభావములు కుదురనే లేదు. ఉభయుల మధ్యను కలహములు వృద్ధికాగా మూడుసంవత్స రముల లోపలనే ఆంగ్లప్రజ లాయనను వెడలగొట్టి హాలెండు దేశమునుండి విలియమును తమకు రాజుగా తెచ్చు కొనిరి. ప్రజాప్రతినిధి సభ యొక్క సమ్మతి లేనిది పన్నులు