పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

ఎనిమిదవ అధ్యాయము

యేకలిసి కోటలను కట్టించెను. మరియు కొత్తరకపు యుద్ధపరికరము లనుగూడ కని పెట్టెను. ప్రజల కెక్కువ న్యాయమును కలుగ చేయుటకు దండ శాస్త్రమునందును, న్యాయవిచారణ : పద్దతుల యందును మార్పులు కలుగ జేసి వివిధములగు చట్టములను చేసి. జస్టీసియసు కాలమునకును, నెపోలియన్ కాలమునకును మధ్య పదునాల్గవ లూయీ రాజును, కాల్బర్టుమంత్రియే కలిసి చేసిన చట్టముల వంటివి పుట్టి యుండ లేదు.


1666 వ సంవత్సరమున ప్రకృతి శాస్త్ర పరిశోధనాల యమును, సంగీతకళాశాలను స్థాపించిరి. 1671 లో శిల్పమును చిత్ర లేఖనమును గరపు కళాశాలలను, ప్రాగ్దేశ భాషలను పరి శోధించు ప్రతిష్టాపనమును నెలకొల్పిరి. మెజరీను స్థాపించిన గ్రంథాలయమునకు పది వేలగ్రంథఘులను చేర్చి ప్రజలంద రా గ్రంథాలయమును స్వేచ్ఛగా వాడుకొనుటకై తెరచిరి. లూయీ రాజు విద్వాంసులకును గ్రంథకర్తలకును చిత్ర లేఖకుల కును ననేక విధముల సహాయము చేయుచుండెను.


విదేశ ములలోకూడ లూయీరాజు యొక్క ఔదార్య ము, విద్యా పోషణము, కీర్తిని బడసెను..విదేశములనుండి విద్వాంసులు, చిత్ర కారులు మొదలగువారు పరాసుదేశము నకు వచ్చి లూయీరాజు యొక్క సత్కారమును బడయు చుండిరి. పదునాల్గవ లూయి యొక్క కాలము సాహిత్యము యొక్కయు కళల యొక్కయు అభివృద్ధి పరాసు దేశ చరి త్రలో ప్రఖ్యాతి చెందిన కాలము. కాల్బర్టుమంత్రి, 1683 వ సంవత్సరమున మరణించెను.