పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
102.

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

స్పెయిన్ రాజ్యమును ఫ్రాన్సుసకు సంక్రమింపచేయ వలెనను సం కల్పము తోనే యీ వివాహమును జరిపెను. 1657 వ సంవత్స రమున ఆస్ట్రియా చరవర్తి మూడవ ఎర్డినాండు మరణించెను. పదునాలుగవ లూయిని అపదవికి ఎన్నుకొనెదరేమో నను అశ మెజరీను కుండెను గాని అట్లు జరుగక మొదటి లియోపాల్టు చక్ర పర్తిగ నెన్ను కొన బడెను. జర్మను రాష్ట్రాధిపతులను చాలమం దిని చేర్చి పరాసు రాజు సంరక్షణ క్రింద నుండునట్లు (లీగు ఆ ది రైను) రైను సంఘము నేర్పాటు చేసెను. ఇందువలన జర్మన్ లోను, ఆస్ట్రియా రాజ్యము లోను పరాసు దేశమునకు మంచి పలుకుబడి యేర్పడినది.


మెజరీను రాజు పేర నిరంకుశముగ పాలించెను. లూయి రాజునకు నిరంకుశత్వమును నేర్పేను. దేశ ప్రతినిధి సభ (స్టేట్సు జనరలు) నెప్పుడును సమావేశ పరచ నేలేదు. ప్రభువుల కుద్యో గము లిచ్చియు గౌరవము లిచ్చియు లోబరచు కొనెను. ప్యారిసు లోని పార్లమెంటను పేరుగల న్యాయాధీపతుల సంఘమువారు కొంత స్వతంత్రముగ పనిచేయు యత్నించగ మెజరీను వాటిలో ముఖ్యులను చెరసాల కంపెను. న్యాయాధిపతులును, కొందరు ప్రభువులును తిరుగ బాటు చేసిరి. 1649 లో రాజమాత పిల్లల తోకూడ ప్యారిసును వదలి పారిపోవలసి వచ్చెను. కొంతకాల ము తిరుగ బాటుదారులు జయమును బొందిరి. మెజరీను దేశ భ్రష్టుడయ్యెను. కానీ కొలది కాలములో తిరుగ బాటుదార్లలో నైకమత్యము చెడి 'మెజరీసు దేశములోనికి తిరుగ వచ్చెను. తిరు గబాటును పూర్తిగ సణ చెను. 'రాజు యొక్క నిరంకుశత్వమును