పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

101

ఎనిమిదవ అధ్యాయము

యగు వియన్నాపట్టణమున ప్రవేశించగనే ఆస్ట్రియావారు సంధిని కోరిరి. 1648 సం! అక్టోబరు 24 న తేదీన వస్టుఫాలి 'యాసంధి జరిగి ముప్పది సంవత్సరముల యుద్ధము అంతరించినది.. ఈ సంధిపలన ఆస్ట్రియా చక్రవర్తియెక్క ప్రాముఖ్యత తగ్గి పోయి యూరఫుఖండములో కెల్ల పరాసు దేశము మిగుల ప్రా ముఖ్యతను పొందినది. ఫ్రొటెస్టెంటు మతస్థులకు మత స్వేచ్ఛ కలుగచేయ బడెను. పరాసు దేశము ఇదివరకే స్వాధీనమును బొం దియున్న లోరెను, ఆల్సెను రాష్ట్రములందు హక్కును సంపాదిం చినది. రైనునదిని దాటి తూర్పున జర్మనీలోనికిని, ఆల్ఫ్ పర్వ తములను దాటి ఆగ్నేయమున ఇటలీలోనికిని పరాసు దేశపు సరి హద్దులు విస్తరింపచేయ బడినవి. జర్మను రాష్ట్రముల వ్యవహార ములలో ఫ్రాన్సునకు ప్రవేశము గలిగినది.


స్పెయిన్ వారు వెస్టు ఫాలియాసంధిలో చేర లేదు. మెజరీ ను ఇంగ్లాండులో నూతనముగ స్థాపించబడిన ప్రజాస్వామ్యమున కధ్యక్షుడగు క్రాంవెలుతో నొడంబడిక చేసికొనెను. ఆంగ్ల పరాసు సేనలు స్పెయిన్ వారి నోడించెను. 1658 నవంబరు నెల లో స్పెయిన్ దేశము సంధిని చేసికొనెను. పదునాలుగవ లూయి రాజు స్పెయిన్ రాకుమార్తె ఇన్ ఫాంటా మేరియూ ఢిలిజూను వివా హమాడెను. ఆమె అయిదులక్షల క్రౌసుల కట్నమును తెచ్చెను. ఇందుకు ప్రతిఫలముగ తండ్రి యొక్క స్పెయిన్ రాజ్యపు వారసత్వ పుహక్కును వదలు కొనెను. స్పెయిన్ రాజు పూర్తిగా కట్నమును చెల్లించనందున ఆమె వార సత్వపు హక్కును వదలుకొనిన ఒడం బడిక చెల్లదని 1659 సంవత్సరమున మెజరీను తెలియపరచెను