పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
100

ఫ్రెంచి స్వాతం త్యనిజయము

భేదములకన్న దేశమే ప్రధానముగ నుండెను. పోర్చుగలువారు స్పెయినురాజుపై తిరుగబడునట్లు చేసి రిచ్లూ పోర్చుగలుకు సహాయము చేసెను. ఈ .యుద్ధములన్నిటిలోను పరాసువారే జయము పొందుచుండిరి. 1642 వ సంవత్సరమున రిచ్లూ మరణించెను. అదివరకు రిచ్లూ కింద పనిచేయుచున్న కార్టీ సలు మెజరీను ప్రధానమంత్రి యయ్యెను. ఈయనయుసు రీచ్లూ వంటి మేధానియు సుప్రసిద్ధరాజ్యూంగ వేత్తయు నైయుండెను. విదేశ వ్యవహారములలో రిచ్లూ యొక్క.అడుగుజాడలనే నడచెను. తరువాత ఆరు నెలలకే పదుమూడవలూయి రాజు మరణించెను. ఆయనకుమారుడగు పదునాల్గవలూయి రాజ్యము నకు వచ్చెను.

(2)

మెజరీను
(1643-1661)

పదునాలుగవలూయి రాజగుసరికి ఐదుసంవత్సరముల యీడు గలదు.ఈయనకు యుక్త వయస్సు వచ్చువరకును తల్లి యగు ఆని ప్రభుత్వమును వహంచెను. కార్డినలు మెజరీను ప్రభుత్వమును నడపెను. ఇదివరకు జరుగు చుండిన ముప్పదిసంవత్సరముల యుద్ధ ము యధాప్రకారము జరుప బడెను. ఇరువది యొక్క సంవత్సర ముల యీడుగల కాండి సేనాని పరాసు సేనలను నిపుణతతో నడి పి 1643 సంవత్సరమున స్పెయిన్ వారిననేక యుద్ధములలో నోడించి జర్మను, ఆస్ట్రియను సైన్యములను తరిమి వేసి, ప్లాండర్సును జయించి, డన్కర్కు. నాక్ర మించి, ఫ్రాన్సునకు ఘనతను చేకూ ర్చెను. 1648 మే నెలలో పరాసు సేనలు ఆస్ట్రియా రాజధాని