పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

99

ఎనిమిదవ అధ్యాయము

ఫ్రాన్సు లోని ప్రభువులతో నెప్పుడును రిచ్లూ పోరాట ములు సలుపుచునే యుండెను. వారి హక్కులను కొంతవఱకు లాగికొనుటకు ప్రయత్నించెను. కాని ప్రభువులు కొంతపఱ కై నను నిలువబడి తమ హక్కులను నిలువ బెట్టుకొనిరి. పరాసు దేశములో తుదివ ఱకును రాజుతో హక్కులలో పోటీపడ దగినవారు ప్రభువులే. 'పెక్కు మార్లు రిచ్లూ మంత్రిని చంపు టకు కుట్రలు జరిగెను. రిచ్లూమంత్రి రాజప్రతినిధులుగను రాజు యొక్క పెద్ద యుద్యోగులుగను ప్రభువులకు మారుగ సామాన్య ప్రజల నుండి యేర్పరచెను.


స్టేట్సు జనరలు (దేశ ప్రతినిధి సభ)ను రిచ్లూ పిలువనేలేదు. వీలయినపుడెల్ల రాష్ట్రములలోని ప్రతినిధి సభలను దీసి వేసెను. న్యాయాధిపతులను (పార్లమెంటు) న్యాయవిచారణ విషయ ములలో తప్ప మరి యేవిషయముల లోను జోక్యము పుచ్చుకొన కుండ చేసెను. అప్పుడప్పుడు రాజ్యములోని కొందరు ప్రముఖు లతో మాత్రము రాజు సంప్రదించునట్లు చేసెను. రాజు యొక్క కార్యనిర్వాహక వర్గము బలపరచబడి అదియే రాజ్య భారమును వహించెను. రాజు నిరంకుశు డయ్యెను.


జర్మనీలో రోమను కాథలిక్కు - మతస్థుడగు ఆస్ట్రియా చక్రవర్తికిని ప్రొటస్టెంటు మతస్థులకును జరుగుచున్న ముప్పది సంవత్సరముల యుద్ధములో రిచ్లూ మంత్రి రోమను కాథలిక్కు- మతస్థుడయ్యును ఆస్ట్రియాకు వ్యతిరేకముగ ప్రొటె స్టెంటులతో చేరెను. జర్మనీలో ప్రొటస్టెంటు మతము నిలు చుటకు రిచ్లూ ముఖ్య కారకుడయ్యెసు. రిచ్లూమంత్రికి మత