పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
90

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ప్రజల యొక్క, మత నమ్మికలను ఆచారములను గౌరవించి వారి మత సంబంధమయిన పండుగలలో పాల్గొనవలెను." అని వ్రాయబడినది. క్రీస్తుకు పూర్వము 278 ముదలు 282 వఱకు భరతవర్షమును పాలించిన అశోక చక్రవర్తి ఇతరుల మత నమ్మి కలతో సానుభూతియు సహనమును చూపుట మానవుని కుండ వలసిన సద్గుణములలో నొకటి యని చెప్పుచుండెడివాడు. తన రాజ్య మందంతటను తన పండ్రెండవ ఆజ్ఞను "మాప్రజ లెవరుసు తమ యిరుగుపొరుగు వారి మతమును గూర్చి నీచముగా మా ట్లాడ గూడదు. మతములలోని తస్సీళ్ళలో నెట్టి భేదాభిప్రాయ ములున్నను, అన్ని మతములుసు మానవులు ఇంద్రియ నిగ్రహ ముసు, మనోనైర్మల్యమును పొందుటయసు పరమావధిని గలిగియుండి ముఖ్యోద్దేశ్యములలో నేకీ భవించుచున్నవను సంగతి జ్ఞాపకముంచు కొనవలెను" అని వ్రాయించి శిలా శాసన ములమీద చెక్కించెను. హిందూ రాజు లేమి, బౌద్దరాజు లేమి అన్ని మతముల వారికిని దానధర్మములు చేయు చుండిరి. “ఆ కాలమున హిందూ దేశములోని రాజులు తమ ప్రజలలో వ్యాపించియున్న మతవిశ్వాసముల నన్నిటిని గౌరవించుచుం డెడివారు"అని 'బుల్లరు 'అను చరిత్ర కారుడు వ్రాసియున్నాడు. “ఇదియే ప్రాచిస హిందూరాజుల పద్ధతి” అని . విన్సెంటుస్మిత్తు వ్రాసి యున్నాడు. చైనా దేశమునుండి ఫాహియాను అను బౌద్ధ యాత్రికుడు హిందూ జేశమును దర్శించుటకు వచ్చినప్పుడు పాటలీపుత్రము నందు విక్రమాదిత్యుడను హిందూరాజు' పాలిం చుచుండెను. "బౌద్ధులును జై సులుసు హిందువులలోని శైవ,