పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89

ఏడవ అధ్యాయము


సందు అనాది కాలమునుండియు నేటివఱకును స్థిరముగా నాటు కొనియున్నవి. కావున హిందూ దేశ చరిత్రలో నెప్పుడును మతము కొఱ కై గాని మతము పేరగాని యెట్టి యుద్ధములుసు జరిగి యుండ లేదు. అన్యమతావలంబులను యెట్టిహింసలకు 'నెప్పుడును లోబఱచి యుండ లేదు. ఎప్పుడును సమస్తమత నమ్మిక లందును సహనమే చూపబడెను. విదేశములనుండి యే యన్య మతస్థులు వచ్చినను హిందూ దేశ వాసులు ఆతిథ్యము నిచ్చిరి. తమతమ దేశ ములలో మత స్వేచ్ఛ లేక కష్టములపాలై ఇచట శరణుజొచ్చిన యూదులకును పౌరసీలకును హిందూమతల్లి సంరక్షణనిచ్చి తన బిడ్డలనుగా స్వీకరించి యున్నది. క్రీస్తుశకము ప్రధమ శతాబ్దములో హిందూదేశమునకు వచ్చిన క్రైస్తవులు పశ్చిచుసముద్రతీరమున స్తిర నివాసమేర్పంచుకొనిరి. "శాంతముగను చుట్టుపట్టునున్న వారితో స్నేహముగను కాలము గడపుచు. తమమతమును కూడ వ్యాపింప జేసికొని యున్నారు. ప్రాచీన హిందూ దేశములోని మత స్వేచ్ఛనుగూర్చిహిందూ దేశ చరిత్రను వ్రాసిన విన్సెంటుస్మిత్తు " పూర్వకాలమున హిందూ దేశము నందు మత నమ్మికలకొఱకై మనుష్యులను బాధలు పెట్టి ఎరుగరు. వివిధ మతావలంబకులు స్నేహముగా కాపురముండు టయేగాక రాజులందరిని నిష్పక్ష పాతముగా చూచి ఉద్యో గముల నిచ్చుచుండిరి. అని వ్రాసియున్నాడు. క్రీస్తుకుపూర్వ ము మూడు వందల సంవత్సరముల క్రిందట హిందూదేశమును పాలించిన చందగుప్త చక్రవర్తి కాలమున వ్రాయబడిన అర్థ శాస్త్రములో " రాజు కొత్త దేశమును సంపాదించినచో, అచటి