పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
88

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

రోమను కాథలిక్కులకు ప్రభుత్వోద్యోగములు , చేయుటకు గాని న్యాయవాది వృత్తి నవలంబించుటకుగాని పార్లమెంటుకు సభ్యుల నెస్ను కొనుటకుగాని పార్లమెంటుకు సభ్యులగుటకు గాని" హక్కులు లేకుండ చేయబడెను. 1868 వ సంవత్సరమున రోమనుకాథలిక్కులు మొదలగువారిమీద గల నిర్బంధము లన్నియు తీసి వేయబడి ఆంగ్లేయ రాజ్యములో సంపూర్ణ మగు మత స్వేచ్ఛ నెలకొలు పబడెను. కాని ఇప్పటికిని ఆంగ్లేయ రాజు మాత్రము చర్చి ఆఫ్ ఇంగ్లాండు శాఖకు చెందిన ప్రొటెస్టెంటు క్రైస్తవుడుగా నుండి తీరవలెను. హిందూ దేశములో బ్రిటిషు ప్రభుత్వము స్థాపించబడుసరికి యూరపుఖండమున మత యుద్ధము లాగిపోయి మత స్వేచ్ఛ బాగుగ నెలకొలుప బడినది. ప్రభుత్వ ములు పౌరులమత విశ్వాసములతోను ఆరాధనా పద్ధతులతోను జోక్యము కలుగ జేసికొనుట మాని వేసిరి.

(8)

హిందూ దేశమున
మతస్వాతంత్రము

ఆనాది కాలమునుండియు హిందూ దేశమున సంపూర్ణ మగు మత స్వేచ్ఛ యుండెను. “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అనగ "భగవంతు డొక్కడు; ఆయనను పండితులు అనేక నామముల పిలిచెదరు," అనియు “ఆకాశా త్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం,సర్వదేవ సమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి” అనగ "ఆకాశము నుండిపడిన యుదక మంతయు సముద్రమున నే చేరునటుల, నేపేరున నారాధించినను ఆ యారాధనము ఒక్కడగు పరమాత్మనే చెందును,” అనియు మొదలగు సిద్ధాంతములు హిఁదూదేశము