పుట:February 2020.అమ్మనుడి.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్యమం

రమేష్‌ పట్నాయక్‌

9440980396

ప్రైవేటు రంగంలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి!

గత మూడు నెలల కాలంలో పాఠశాలలలో బోధనా మాధ్యమంపై చాలా పరిణామాలు జరిగాయి. రాష్ట్రప్రభుత్వం మండల మరియు జిల్లా పరిషత్‌ యాజమాన్యాలలో మరియు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న పాఠశాలలలో వచ్చే విద్యాసంవత్సరం నుండి మాతృభాషా మాధ్యమాన్ని వూర్తిగా తొలగిస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ గత సంవత్సరం నవంబర్‌ 5వ తేదీన ప్రభుత్వ ఆదేశం 81ని అలాగే అనంతరం చిన్న సవరణతో దాని స్థానంలో జి.ఒ 85ని తీసుకురావడంతో రాష్ట్రంలో పెద్ద చర్చ ప్రారంభం అయింది. ఇప్పుడు జి.ఒ 85 కు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం విషయంలో జి.ఒ ఇవ్వడమే కాక ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అధికార పార్టీకి ఉన్న సంఖ్యాబలం వలన శాసన సభలో సంబంధిత బిల్లు ఆమోదం పొందినా వామపక్ష యం. ఎల్‌. సిలు మరియు ప్రతిపక్ష యం.యల్‌.సిలు అధికంగా ఉన్న శాసన మండలి బిల్లును వెనక్కి తిప్పి పంపింది. అయితే. శాసన మండలి సవరణలను తిరస్కరిస్తూ శాసన సభ మరల బిల్లును ఆమోదించింది. ఏదేమైనా బిల్లు ఇంకా చట్టం కాలేదు.

ప్రభుత్వ జిత్తులు

మరొకవైపు జిఒ 85కి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నడుస్తున్నది. ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా రుద్దుతున్న జి.ఒ 85ని కోర్టు రద్దుచేయవచ్చనే ఆందోళన ప్రభుత్వానికి ఏర్పడింది. అందుకే ఆదరాబాదరాగా మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇస్తూ వారిని మాధ్యమాన్ని ఎంచుకోమని కోరుతూ జనవరి 21న తమ ఎంపికను ఒక దరఖాస్తు ద్వారా తెలియజేయాలని ప్రభుత్వం ఒక మెమో విడుదల చేసింది. అయిత్తే ప్రభుత్వం రూపొందించిన నమూనా దరఖాస్తు ఆంగ్ల మాధ్యమం వైపు ఒరిగి ఉంది. దరఖాస్తు నమూనా రూపొందించడంలో ప్రభుత్వం చూపిన జిత్తులమారి తనాన్ని ప్రక్కన పెడితే అసలు ఆవిధంగా బాలల తరపున మాధ్యమాన్ని నిర్ణయించే అధికారం ఇటు ప్రభుత్వానికి గాని అటు తల్లిదండ్రులకు గాని లేదు అనేది ప్రధాన విషయం. బాలల తరవున రాజ్యాంగమే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంది. ఎలిమెంటరీ విద్యను మాతృభాషలో పొందడం బాలల హక్కు అని, అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగం 351 ఎ అధికరణం చెప్తున్నది. తల్లి మరియు తండ్రి వేరువేరు భాషలకు చెందిన వారైనప్పుడు వారిలో ఎవరి భాషను వారి బాలలకు మాతృభాషగా పరిగణించాలో నిర్ణయించే పరిమిత అవకాశం మాత్రమే రాజ్యాంగం బాలల తల్లిదండ్రులకు కల్పించింది. మాతృభాషను ప్రక్కన పెట్టి బాలలకు ఆంగ్ల మాధ్యమాన్ని ఎంపికచేసే అవకాశం రాజ్యాంగం తల్లిదండ్రులకు కల్పించలేదు. 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టం కూడా రివ తరగతి వరకు బాలలకు మాతృభాషలోనే విద్య అందించాలని నిద్దేశిస్తున్నది. విద్యాహక్కు చట్టం కూడా బాలల తరపున మాధ్యమాన్ని ఎంవికచేసే అధికారం ప్రభుత్వానికి గాని లేదా అటువంటి అవకాశం తల్లిదండ్రులకుగాని ఇవ్వలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాజ్యాంగాన్ని గాని అటు విద్యాహక్కు చట్టాన్నిగాని వట్టీంచుకోకుండా అంగ్ల మాధ్యమ విధానాన్ని బలవంతంగా అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నది.

ఇక కోర్టు ముందున్న వ్యాజ్యం చాలా గందరగోళమైనది. ఈ వ్యాజ్యం మాతృభాషలో విద్యను పొందడం బాలల హక్కు అని దానిని ప్రభుత్వం అమలు చేయాలని కోరడం లేదు. బాలల తరపున మాధ్యమాన్ని నిర్దేశించే అవకాశం బాలల తల్లిదండ్రులకు ఉండాలని మాత్రమే జి.ఒ 85కి వ్యతిరేకంగా వ్యాజ్యం వేసినవారు కోర్టును కోరుతున్నారు. కోర్టు కేసును కొట్టివేస్తే జిఒ 85 అమలు అవుతుంది. కోర్టు జిఒ 85ను కొట్టివేసినా బాలల తరవున మాధ్యమాన్ని నిర్ణయించే అవకాశం తల్లిదండ్రులకు బదలాయించడానికి (ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండు సందర్భాలలో కూడా అది రాజ్యాంగానిక్కి విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగానే ఉంటుంది. కోర్టు సహజంగా వ్యాజ్యం పరిమితులలోనే తీర్పు ఇస్తుంది. ఈ తీర్పులో కోర్టు మహా అయితే జి.ఒ 85ను రద్దుచేస్తుంది కాని విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయమని నిర్దేశించదు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న బాలల తల్లిదండ్రులు అత్యధిక సంఖ్యలో ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటారనడంలో సందేహం లేదు. హైకోర్టు సదరు జి.ఒ ని కొట్టివేసినా తల్లిదండ్రుల ఎంపికపై ఆధారపడి మాధ్యమ విషయాన్ని పాఠశాలల వారిగా ప్రభుత్వం అమలు చేయగలదు. ప్రభుత్వం తీసుకు వచ్చిన బిల్లు చట్టం అయినా కాకపోయినా, ప్రభుత్వం ఇచ్చిన జి.ఒ కొట్టి వేయబడినా ప్రభుత్వ విధానం అమలు జరిగే దురదృష్ట పరిస్థితి ఉంది. ప్రభుత్వ మరియు (ప్రైవేటు పాఠశాలలలో విద్యాహక్కు చట్టం ప్రకారం మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయమని ఇంతవరకు కోర్టులో ఏ వ్యాజ్యం దాఖలు కాలేదు.

అత్యధిక ప్రజలు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకోవడమే అసలు సమన్య, ప్రజలను ఆ విధంగా తయారు చేయడంలో ప్రైవేటు యాజమాన్యాలు మరియు అధికార పార్టీలు విజయవంతమైనాయి. కార్పోరేటు సంస్థలు ఆంగ్ల మాధ్యమాన్ని ఒక అదనపు ఆకర్షణగా

| తెలుగుజాతి పత్రిక జుమ్మనుడి. ఆ ఫిబ్రవరి -2020 |