పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

దంపూరు నరసయ్య


ఈ పాఠశాలల్లో సంపన్నుల పిల్లలు అనుభవించే సమస్త సౌకర్యాలు పేదవిద్యార్థులకు అందుబాటులో ఉండేవి. జీతాలు చెల్లించిన విద్యార్థులకు ఇచ్చినట్లే పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చేవారు. బొంబాయి నగరంలోనూ ఇదే పద్ధతి ఉండేది. అక్కడి విశిష్ట పౌరులు అనేకులు ఈ విధంగా ఉన్నత విద్య అభ్యసించి పైకి వచ్చినవారే.”

పీపుల్స్ ఫ్రెండ్ కు ప్రభుత్వ వ్యతిరేకత

"The Hindu came to head on collision with the British Administration and its bureaucrats almost from its birth...... and waged a grinding and relentless debate"60

ఈ మాటలు హిందూ పత్రికను గురించి రాసినవే అయినా, స్వాభిమానంతో మనుగడ సాగించిన ఆనాటి పత్రికల కన్నిటికీ అన్వయిస్తాయి. పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభమైన కొత్తల్లోనే ప్రభుత్వం చిన్నచూపుకు, ఆగ్రహానికి గురిఅయింది. తమిళనాడు ఆర్కైవ్స్‌లో నరసయ్య 1886 ఫిబ్రవరి 24వ తారీకున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ భద్రపరచబడి ఉంది. 1886 ఫిబ్రవరి 22 తారీకుతో విడుదలైన జి.ఓ 397కు సమాధానంగా నరసయ్య ఈ లేఖ రాసినట్లు స్పష్టంగా ఉంది.61 ఈ లేఖ అనువాదం.

మద్రాసు,

24-2-1886

అయ్యా ,

397 జి.ఓ సంబంధించి ఈ లేఖ రాస్తున్నాను. ప్రభుత్వం ఉపయోగం కోసం నాకు ఇప్పటి నుంచి పీపుల్స్ ఫ్రెండ్ వారపత్రిక ఉచితంగా పంపేందుకు అనుజ్ఞ దయచేయమని అర్ధిస్తున్నాను. పత్రిక క్రమంతప్పకుండా వెలువడుతూ ఉంది. పెద్ద సంఖ్యలో పాఠకులున్నారు. నా దేశప్రజల ఇబ్బందులను, ఆకాంక్షలను గురించి రాసే ఈపత్రికను ప్రభుత్వఅధికారులు అప్పుడప్పుడు చదవడానికి తప్పక అవకాశం కలుగ జేయాలి. గౌరవపూర్వకంగా పంపబడుతున్న ఈ పత్రికను తిరస్కరించరనే భావిస్తున్నాను.

ఉంటాను

తమ విధేయుడైన సేవకుడు

డి. నరసయ్య

“పీపుల్స్ ఫ్రెండ్” యజమాని

ఇట్లా మొదలైన అధికారుల అసహనం, ద్వేషం 1888 కల్లా పరాకాష్ఠకు చేరుకుంది. 1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ సంచిక

పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభించిన అయిదారు సంవత్సరాల లోపలే, నరసయ్యకు