పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

81


సమీకరించాయి. ఆంగ్లో ఇండియన్ ప్రెస్‌తో పోరాడి తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాయి. కలకత్తా టౌన్‌హాలు సభ తర్వాత భారతీయ పత్రికలు తీవ్రంగా స్పందించాయి. తెల్లవారి జాత్యహంకార ధోరణిని నిరసిస్తూ సంపాదకీయాలు రాశాయి. బ్రాన్సన్ ఇంగ్లండులో గొప్ప సంస్కారిలాగా నటిస్తూ అక్కడి సభలో ఉపన్యసించిన తర్వాత నరసయ్య “టూ పిక్చర్స్” సంపాదకీయం రాశాడు. ఈ సంపాదకీయం రాసేనాటికి నరసయ్య పత్రిక ప్రారంభించి మూడేళ్ళు. భారతీయ, యూరోపియన్ జాతులు సామరస్యంగా కలిసిమెలిసి జీవించే అవకాశం జారిపోతున్నదనే ఆవేదన ఈ సంపాదకీయంలో ఉంది. ఆవేశానికి లోనుగాకుండా వివేచించే శక్తి, వాదం వినిపించే నేర్పు, పరిణతి చెందిన రాజకీయ అభిప్రాయాలు, వైదుష్యం, వ్యంగ్యం కలబోసిన పరిహాసం ఈ సంపాదకీయానికి గొప్ప శక్తి నిచ్చాయి.

1886 జనవరి 30 పీపుల్స్ ఫ్రెండ్ సంచిక

తమిళనాడు ఆర్కైవ్స్‌లో ఈ సంచిక భద్రపరచబడి ఉండేది. దురదృష్టవశాత్తు, ఆ ఫైలు ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఈ సంచిక తాలూకు కొన్ని ఫోటోలు (ఆర్కైవ్స్ అధికారికంగా సప్లై చేసినవి) బంగోరె పేపర్లలో లభించాయి.

పత్రిక తొలిపుటలో కలకత్తా నగల వర్తకులు కె.సి.ఆర్. దాస్ అండ్ కో వారి ప్రకటన, కలకత్తా నుంచి వెలువడే ఇంగ్లీషు వారపత్రిక "న్యూ ఇండియా” ప్రకటన, ఓరియంటల్ బాం వంటి మందుల ప్రకటనలు ఉన్నాయి. మూడవపుటలో "Do they deserve it", "Mrs. Grant Duff's advice to Europian and Eurasian lads", "Royal speech" అనే మూడు సంపాదకీయాలు ఉన్నాయి. ఈ సంచికలోనే కల్నల్ ఆల్కాట్ వ్యవసాయం మీద రాసిన వ్యాసం (Coln., Olcott on Agriculture), న్యూస్ అండ్ నోట్సు శీర్షికలో "Cost of Education in Madras" అనే వ్యాసం ఉన్నాయి.

ఈ సంచికలోనే Western Star పత్రిక నుంచి "Some Indian Newspapers" అనే కథనం పునర్ముద్రించబడింది. పత్రికల పేర్లతో ఈ కథనం సాగుతుంది. "In these Times of India great Progress is being made" అని మొదలయి "...... avoid the absurd claims of the Theosophist and other shams. A Muslim Herald is required to call the attention of his class to the want of ambition of the Musalman అని సాగి "......The Argus eyed press has been a great factor in educating the people; and in these days, life would actually be a blank, if the Madras Mail miscarries for a single day. The press is undoubtedly the People's Friend and is the Mirror of Native Public Opinion" అనే వాక్యాలతో ముగుస్తుంది. అనేక సమకాలిక పత్రికల పేర్లు ఇందులో