పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

దంపూరు నరసయ్య


పత్రిక వెలువడుతున్న రోజుల్లో ఫారో అండ్ కో ఆ పత్రికను ప్రచురించేది. ఘనత వహించిన ఈ టౌన్‌హాలు సిసిరో (Cicero) బర్మింగ్‌హేంలో అశ్లీలభాగాలు తొలగించబడి, నిర్దుష్టంగా రూపొందించబడిన ప్రచురణ వంటి సిసిరో - ఇంతా చేస్తే మదరాసీ. తానిప్పుడున్న స్థితికి ఈ పట్నం నుంచే ఎదిగినందుకు మేము ఎంతగానో గర్విస్తున్నట్లు ప్రకటిస్తున్నాము. తన గంభీరమైన వాక్కులతో మాగ్నాకార్టా గురించి, ప్రాచీనమైన హక్కుల గురించి ఉపన్యసించి కలకత్తా యూరేషియన్లను (Eurasians) యూరోపియన్లను, ఒక మదరాసీగా మంత్రముగ్ధులను చెయ్యలేదని తెలుసుకొన్నపుడు పశ్చాత్తాపం వంటి భావం ఒకటి మాకు కలిగింది. స్థిమితంగా ఆలోచించి ముసాయిదా బిల్లు మంచి చెడ్డలను అర్థం చేసుకోలేని మానసిక స్థితిలో ఉన్న శ్రోతలను ఉద్దేశించి, జాతి ద్వేషం హృదయాల్లో నాటుకొని పోయి ఉద్విగ్న స్థితిలో ఉన్న శ్రోతలను ఉద్దేశించి, తీవ్రమైన భాషలో ఈ బార్ సభ్యుడు చేసిన ఉపన్యాసం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

బ్రాన్సన్ స్వల్ప విషయాలకు లేనిపోని ఆర్భాటంచేసి, అనాగరికంగా ప్రవర్తించడానికి ఎటువంటి కారణంలేదని స్పష్టంగా తెలుస్తూంది. తనలాగే ఈ దేశంలో జన్మించి, ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చి, ఇంగ్లాండులో వృత్తిపరమైన అర్హతలు సంపాదించుకొన్నవారు, అవినీతిపరులైన బాబులను గురించి కలవరపాటు చెందనవసరం లేదని ఇప్పటిదాకా తెలుసుకొని ఉండకపోతే ఇప్పుడైనా గ్రహించాలి. టౌన్‌హాల్లో ఇతని ప్రవర్తన తాము ఉత్తమ జాతివారమని ప్రదర్శించుకొనే గర్వంగా మేము భావిస్తున్నాము. ఇతనికున్న నేపథ్యం వంటి నేపథ్యం నుంచి వచ్చి ఇతని మాదిరే విద్యాధికులై, ఇతని మాదిరే అదృష్టవంతులైన వ్యక్తుల్లో పొడసూపే గర్వంగా దీన్ని మేము భావిస్తున్నాము. అందువల్ల బ్రాన్సన్ దురాగ్రహాన్ని ఆయన శ్రోతల ఆగ్రహం కంటే భిన్నమైనదిగా మేము పరిగణిస్తున్నాము. ఇతను పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా తాను పొందిన ప్రతి అవకాశానికి, ఈ దేశానికి రుణపడి ఉన్నాడు. ఈ దేశ ప్రజలతో కలసిమెలసి జీవించాడు. ఈ దేశప్రజల డబ్బే ఇప్పటికి ఇతని జోబిలోకి పోతూంది. ఇటువంటి వ్యక్తి కృతఘ్నతతో నిండిన, దుస్సహమైన ప్రవర్తనను మేము నిస్సంకోచంగా ఖండిస్తున్నాము. సరేలేండి, ప్రజలు "బ్రూటస్ నువ్వు కూడానా?” (et tu Brute) అని ఆశ్చర్యపోవచ్చు. ఇతని ప్రసంగంగానీ, ఇతని సోదరుడు అట్కిన్ (Atkin) ఉపన్యాసంగానీ, ఇల్బర్ట్‌బిల్లు రూపంలో ఉన్న సర్పాన్ని గాయ పరచాయేగానీ చంపలేకపోయాయి. ఈ విషయంలో హోంశాఖ (Home Authorities) వైస్రాయిని బలపరచడానికి నిశ్చయించుకొన్నట్లు తాజా వార్తలవల్ల తెలుస్తూంది. ప్రభుత్వ నిర్ణయానికి ఈ కోపోన్మాదమే కారణమయింది. వివేకం కోల్పోయి, న్యాయమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అమానుషమైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెర్రి అపోహల వల్లే అన్ని వర్గాలకు అనుకూలమైన పరిష్కారాన్ని నిరాకరిస్తున్నట్లు ఈ సంఘటన సూచిస్తుంది. కాసేపు బ్రాన్సన్‌ను అట్లా ఉంచుదాం. ప్రతి రంగంలోను