పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

దంపూరు నరసయ్య


భారతదేశంలోని యూరోపియన్ సమాజం కలిసి కట్టుగా ఉద్యమం కొనసాగించి, బ్రిటిష్ సామ్రాజ్యం ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చినట్టు ఒక అభిప్రాయాన్ని కలిగించింది.

భారతీయ పత్రికలు, మేధావులు, విద్యావంతులు ఇల్‌బర్ట్ బిల్లును స్వాగతించారు. ఈ బిల్లును మార్పులేకుండా యథాతథంగా ఆమోదించాలంటూ ప్రజాభిప్రాయాన్ని సమీకరించారు. బిల్లులో ప్రతిపాదించిన మంచి విషయాలను గుర్తించి, భారతీయ పత్రికలు ఈ బిల్లు చట్టం కావాలని రాశాయి. పార్లమెంటులో మంత్రివర్గంమీద బిల్లు ఉపసంహరించుకోవాలని శ్వేతజాతీయులు తమ పలుకుబడినంతా ఉపయోగించారు. చివరకు కొన్ని సవరణలతో ప్రభుత్వం బిల్లు పాసుచేసింది. ఇందులో భారతీయ నేరస్థులకు లేని కొన్ని ప్రత్యేక సౌకర్యాలు యూరోపియన్ నేరస్తులకు కలిగించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన యూరోపియన్ వర్గాలు ఈ విధంగా తమ జాత్యహంకార స్వభావాన్ని నిలబెట్టుకోగలిగాయి. దీంతో భారతీయులకు బ్రిటిష్ ప్రభుత్వం మీద ఉన్న భ్రమలు తొలగిపోయాయి. వారి ఆత్మగౌరవం మేలుకొన్నది. ఇల్‌బర్టు బిల్లుకు వ్యతిరేకంగా యూరోపియన్ వర్గాలు ఉద్యమం సాగిస్తున్న రోజుల్లో, బిల్లు సవరణలతో చట్టం కాబోతున్న సమయంలో 1883 డిసంబరు 1వ తేది పీపుల్స్ ఫ్రెండ్‌లో నరసయ్య “టూ పిక్చర్స్” (Two Pictures) పేరుతో ఒక సంపాదకీయం రాశాడు.

కలకత్తా టౌన్‌హాలు సభ

1883 ఫిబ్రవరి 28న కలకత్తా టౌన్‌హాల్లో శ్వేతజాతీయులు పెద్దఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేశారు. టీతోటల యజమానులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు అసంఖ్యాకంగా ఈ సమావేశానికి తరలివచ్చారు. ఆంగ్లో ఇండియన్లు, (Anglo Indians) అర్మీనియన్లు (Armenians) గూడా పెద్దసంఖ్యలో హాజరయ్యారు. టౌనహాలు జనంతో కిటకిట లాడింది. వక్తలు ఆవేశంతో ఊగిపోతూ జాత్యహంకారాన్ని రెచ్చగొడుతూ ఉపన్యాసాలు చేశారు. కలకత్తా హైకోర్టులో బారిస్టరు ప్రాక్టీసు (Barrister practice) చేస్తున్న ఫరంగీ బ్రాన్‌సన్ (Feringhee Branson) భారతీయ న్యాయాధిపతులను, మేజిస్ట్రేట్లను దూషిస్తూ అసహ్యంగా, అనాగరికంగా పొగరుబోతుతనం ఉట్టిపడేటట్లు మాట్లాడాడు. ఆ సభ జరిగిన తరువాత భారతీయ వకీళ్ళు, అడ్వొకేట్లు అతనితో కలిసి పనిచేయడానికి నిరాకరించారు. భారతీయ పత్రికలు ఆయన ఉపన్యాసం మీద తీవ్రంగా స్పందించాయి. బ్రాన్సన్ తను వాడిన భాష సరియైనది కానందుకు క్షమాపణ చెప్పాడుగాని, మాట్లాడిన విషయాలకు పశ్చాత్తాపం ప్రకటించలేదు.59 ఇతను ఇంగ్లాండు వెళ్ళినప్పుడు బర్మింగ్ హేం (Birmingham) లో మర్యాద తొణికిసలాడే కంఠస్వరంతో ఎంతో సంస్కారిలాగా ప్రసంగించాడు. నరసయ్య "టూ పిక్చర్స్” లో బ్రాన్సన్ వికృత నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాడు. హిందువులకు, యూరోపియన్లకు మధ్య