పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

65


the attention of the Heads of Departments to the "People's Friend" as an English medium for the advertisements.

I have the honour to be Sir,

Yours most obedient servant,

D. Narasaiah,

Editor & Proprietor.

ఆయా ప్రభుత్వ శాఖలు అవసరం అనుకొంటే పీపుల్స్ ఫ్రెండ్‌కు ప్రకటనలు ఇవ్వవచ్చునని, ఉత్తరం మీద అధికారి రాసిన నోట్లో ఉంది.

1888 ఫిబ్రవరి 25 సంచిక సంపాదకీయంలో “ఈ ప్రెసిడెన్సీలో ఒక స్థానిక పత్రికగా హిందూ తర్వాత స్థానం మాదే. హిందూ అచ్చు వేసే ప్రతి మూడు సంచికలకు మేము ఒక సంచికను అందించ గలుగుతున్నాము” అని పత్రికా లోకంలో పీపుల్స్ ఫ్రెండ్ స్థానాన్ని నరసయ్య పేర్కొన్నాడు.

మద్రాసులో సంస్కార భోజనం

1882 నాటికి మద్రాసు పత్రికలు నరసయ్యను సంస్కర్తగా గుర్తించాయి. జూలైలో మద్రాసులో ఏర్పాటయిన ఒక సంస్కార భోజనంలో ఆయన పాల్గొన్నాడు. రాజమండ్రిలో తొలి వితంతు వివాహం జరిపించి, ఆ దంపతులను వెంటబెట్టుకొని, వీరేశలింగం మద్రాసు వచ్చాడు. వీరేశలింగం బృందంతో కలిసి భోజనం చేయడమే సంస్కార భోజనం. ఈ సంఘటనకు పూర్వం మద్రాసులో కొన్ని సంగతులు జరిగాయి.

వీరేశలింగం పట్టుదల, కృషి వల్ల 1881 డిసెంబరు 11వ తేదీ రాజమండ్రిలో తొలి స్త్రీ పునర్వివాహం జరిగింది. ఈ పెళ్ళికి ముందే దక్షిణ భారతదేశంలో రెండు స్త్రీ పునర్వివాహాలు జరిగాయి. 1867లో బెంగుళూరులో ఒక వివాహం జరిగింది. వధువు తండ్రి మహారాష్ట్ర బ్రాహ్మణుడు. సంఘ బహిష్కరణకు వెరవకుండా తన కుమార్తె పునర్వివాహం జరిపించాడు. నాగర్‌కోయిల్‌లో శేషయ్యంగారు అనే న్యాయవాది తన కుమార్తెకు పునర్వివాహం చేశాడు. ఈ పెళ్ళి జరిగిన తర్వాత ఆ కుటుంబం బహిష్కరణకు గురి అయింది. రజకులు, క్షురకులు, పురోహితుల సేవలు అందకుండా చేశారు. కుటుంబ సభ్యులకు ఆలయ ప్రవేశం నిరాకరించబడింది. చివరకు బావుల్లో నీళ్ళు తోడుకోనీకుండా కట్టడి చేశారు. ఈ సంగతులన్నీ 'ఎథీనియం' పత్రిక తెలియజేసింది. ఈ సాంఘిక బహిష్కరణ ఒత్తిడిని ఎదుర్కొనడానికి శేషయ్యంగారు స్త్రీ పునర్వివాహ సంఘాన్ని స్థాపించి, వితంతు బాలికలకు వివాహం జరిపించేవారికి ఆర్థికసహాయం, సలహాలు అందించడానికి కృషి చేశాడు. నాగర్‌కోయిల్ బ్రాహ్మణ సమాజంవల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోడానికి అవసరమైన సహాయ సహకారాలు అర్థిస్తూ