పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

59


అయి ఉంటుంది. ఆ రోజుల్లో దేశీయుల యాజమాన్యంలో సాగే పత్రికావ్యాపారాల్లో పెద్ద లాభాలు ఉండేవికావు. యజమానులకు, సంపాదకులకు కొద్దిమొత్తం ప్రతిఫలంగా మిగిలేది. మంచి సర్క్యులేషను ఉన్న పత్రికలలో కూడా మూడంకెలకు మించి ఆదాయం ఉండేది కాదు.22 నరసయ్య ప్రభుత్వోద్యోగం చేసిన కాలంలో కూడబెట్టిన డబ్బంతా ప్రెస్సు కోసం వెచ్చించి ఉంటాడు.

"I was the Editor of People's Friend at Madras from April 1881 to 1897 July" అని నరసయ్య నెల్లూరుజిల్లా మునిసిఫ్ కోర్టు (Nellore District Munsif Court) లో ఇచ్చిన వాఙ్మూలంలో పేర్కొన్నాడు. "People's Friend order book from April Ist 1881 to 30th September 1883" అని నరసయ్య సొంతదస్తూరితో రాసిపెట్టిన ఆఫీసు ఆర్డరు బుక్కు లభ్యమయింది. 1883 డిసంబరు 1వ తారీకు పీపుల్స్ ఫ్రెండ్ సంచిక వాద సంపుటం III సంచిక 18 అని, 1886 జనవరి 30 సంచిక మీద సంపుటం VI సంచిక 5 అని, 1888 ఫిబ్రవరి 25 సంచికమీద సంపుటం VIII సంచిక 8 అని ఉంది.23

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ ప్రజల పత్రికని, అతి సామాన్యులైన గుమాస్తాలకు సైతం అందుబాటులో ఉండాలని భావించాడు. పత్రిక నుదుటి మీద "A Cheap Journal published every Saturday evening" అని ప్రకటించుకొన్నాడు. 1883 డిసంబరు 1 సంచికలో నెలచందా ఆరణాలని, ముందుగా చందా పంపిన వారికి సంవత్సరం చందా నాలుగున్నర రూపాయలని, సంవత్సరం అంతా పత్రిక స్వీకరించి, చివర చందాపంపేవారికి ఆరురూపాయలని ఉంది. 1886 జనవరి 30 సంచిక ముఖపత్రం మీద దళసరి కాగితంమీద ముద్రించిన పత్రిక సంవత్సరం చందా ఆరురూపాయలని, పల్చని కాగితంమీద ముద్రించిన పత్రిక చందా నాలుగున్నర రూపాయలని ఉంది.

ఆ రోజుల్లో మద్రాసు ఫోర్ట్ సెంట్ జార్జి గెజిటు మంగళవారం సాయంకాలం విడుదలయ్యేది. అందులోని వార్తలు సేకరించుకొని, ముద్రించుకోడానికి అనువుగా పీపుల్స్ ఫ్రెండ్ శనివారం సాయంత్రం రాయల్ సైజులో నాలుగుఫారాలు అంటే ఎనిమిది పుటలతో వెలువడేది.24 తొలి మలి పుటలు, చివరిపుట నిండుగా ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో ప్రకటనలుండేవి. “ది థింకర్ ఏన్ ఆంగ్లో తమిళ్ జర్నల్ ఆఫ్ ది ఫ్రీథాట్” పత్రిక ప్రకటన 1883 డిసంబరు 1 తొలిపుటలో ఉంది. ఆనాటి ఇతర పత్రికలలో ఇదే విధంగా ప్రకటనలుండేవి. 1950 వరకూ 'హిందూ' తొలి పుట నిండుగా ప్రకటనలుండేవి.

నరసయ్య పత్రిక తీసుకొనిరావడంతో పాటు పుస్తకప్రచురణ, విక్రయం కూడా సాగించాడు. ఇంగ్లీషు, తమిళం, గ్రంథ లిపులలో పుస్తక ప్రచురణ, జాబ్ వర్కు, 'పీపుల్స్