పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

57


వ్యక్తులు. మద్రాసు ప్రెసిడెన్సీ ప్రజాభిప్రాయాలను ఈ పత్రికలు తెలియజేస్తూ వచ్చాయి. కొంతకాలం తర్వాత ఈ రెండు పత్రికలు కలిసి, మద్రాస్ నేటివ్ ఒపీనియన్ (Madras Native Opinion) ఆవిర్భవించింది. ప్రభుత్వం దేశభాషాపత్రికల చట్టం అమలుచేసినపుడు, ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాయడానికి దేశీయుల చేతుల్లో ఇంగ్లీషు పత్రికలు లేకుండాపోయాయి.13

హిందూ ఆవిర్భావం

ఎం. వీరరాఘవాచారి, జి. సుబ్రహ్మణ్యఅయ్యరు పచ్చయ్యప్ప విద్యాసంస్థలో అధ్యాపకులు. వీరి అధ్వర్యంలో ట్రిప్లికేన్ లిటరరీ సొసైటీ (Triplicane Literary Society) మద్రాసు పౌరుల అభిప్రాయ వేదికగా పనిచేసింది. ముత్తుస్వామి అయ్యరు హైకోర్టు జడ్జి నియామకాన్ని, యూరోపియన్ పత్రికలతో పాటు, దేశీయుల యాజమాన్యంలో నడుస్తున్న “మద్రాస్ నేటివ్ పబ్లిక్ ఒపీనియన్" పత్రిక కూడా వ్యతిరేకించింది. కొన్ని భాషాపత్రికలు అయ్యరు నియామకాన్ని సమర్థిస్తూ రాసినా, వాటి ప్రభావం చాలా తక్కువ.14 1877లో మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం మీద పదమూడు దేశభాషాపత్రికలు మాత్రమే ఉన్నాయి. వాటి సర్క్యులేషను (circulation) నాలుగువేలకు మించదు.15 ఆంగ్లో ఇండియన్ పత్రికల విమర్శ ఎదుర్కొనడానికి, స్థానికుల అభిప్రాయాలు తెలియపరచడానికి, ఒక ఇంగ్లీషు పత్రిక కావాలనే తీవ్రమైన కాంక్ష నుంచి హిందూ జన్మించింది.

1878 సెప్టెంబరు 20న 'హిందూ' వారపత్రికగా ఆరంభమైంది. ఎం. వీరరాఘవాచారి, జి. సుబ్రహ్మణ్యఅయ్యరు, వారి నలుగురు మిత్రులు ఈ పత్రికను ప్రారంభించారు. దీనికి సుబ్రహ్మణ్యఅయ్యరు సంపాదకుడుగా, వీరరాఘవాచారి ప్రచురణకర్తగా వ్యవహరించారు. హిందూ 1883లో ట్రైవీక్లీ అయింది, 1889లో దినపత్రికగా ఆవిర్భవించింది.16

1881 లో భాష్యంఅయ్యంగారి అధ్యక్షతన మద్రాస్ నేటివ్ అసోసియేషను కొంతకాలం క్రియాశీలంగా పనిచేసింది. ప్రభుత్వం ఈ సమాజ వ్యవహారాలను అనుమానించడంతో చాలామంది అందులో సభ్యత్వం తీసుకోడానికి వెనుకంజ వేశారు. 1884లో మద్రాసు మహాజనసభ ఏర్పడేదాకా, మద్రాసు మేధావుల వాణిని వినిపించడానికి హిందూ ఒక వేదిక అయింది.17 హిందూ యాజమాన్యం 1881 నుంచి 'స్వదేశమిత్రన్' తమిళ వారపత్రికను ప్రచురించడం మొదలుపెట్టింది. ఇది 1889లో దినపత్రికగా పరిణమించింది. దక్షిణ భారతదేశంలో ఒక దేశభాషలో వెలువడిన తొలి దినపత్రిక ఇదే.18 హిందూను ప్రారంభించిన కొన్ని సంవత్సరాల వరకు వీరరాఘవాచారి, సుబ్రహ్మణ్య అయ్యరు, పచ్చయ్యప్ప సంస్థలో అధ్యాపకులుగా కొనసాగారు. ఇది సంధికాలం. దేశీయుల యాజమాన్యంలోని పత్రికలు ఔత్సాహిక దశను దాటి నిర్వాహకులు