పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

53


భావావేశాలకు లోనుకాకుండా, వెంటనే నివారించే బాధ్యత మేజిస్ట్రేటు మీద ఉందని నరసయ్య తన ఉత్తరంలో హెచ్చరిస్తాడు. ఇది ప్రజలు తమ వృత్తి కొనసాగించే క్రమంలో ఏర్పడే అసౌకర్యం అని, ఇటువంటి అసౌకర్యాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయనే భావనతో మేజిస్ట్రేట్లు చర్య తీసుకోకుండా ఉపేక్షించి ఉంటారని నరసయ్య వివరిస్తాడు. ఇటువంటి సందర్భాలలో చట్టం ఏమి చెప్తున్నదో వివరిస్తాడు.

“నీ వృత్తి కొనసాగించుకోడానికి చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ రక్షణ ప్రజలకు అసౌకర్యం కలిగించనంత వరకే. అసౌకర్యం కలిగిన మరుక్షణంలోనే నీ ప్రవర్తన సివిల్, క్రిమినల్ (Civil, Criminal) చర్యలకు అర్హమవుతుంది. ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లుతున్న సందర్భాలలో నీకు చట్టపరమైన రక్షణ ఉండదు.” అని వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ భద్రతకూ మధ్య ఉన్న పల్చని సరిహద్దు రేఖను విశదీకరిస్తాడు.

ఇటువంటి సందర్భాలలో మేజిస్ట్రేట్లు మెతకగా వ్యవహరించడంవల్ల కలిగే నష్టాలను నరసయ్య ఈ ఉత్తరంలో విశదంచేస్తాడు. “మేజిస్ట్రేట్లు చర్య తీసుకోక పోవడంవల్ల, చట్టం తమకు అండగా ఉంటుందనే విశ్వాసం ప్రజలలో సన్నగిల్లుతుంది. చట్టాలను ఉల్లంఘించేవారికే అవి అనుకూలంగా ఉంటాయని తెలిస్తే, వాటిని ఎవరు గౌరవిస్తారు? ద్వేషించకుండా ఎందుకుంటారు? ప్రభుత్వోద్యోగులు చట్టప్రకారం వ్యవహరించకుండా, సంవేదనలను అనుసరించి నడుచుకొంటే, చట్టాన్ని ఉల్లంఘించేవారు ఇవి తమకు చాలామంచి రోజులని భావిస్తారు. చట్టాన్ని గౌరవించేవారు మాత్రం ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని అనుకొంటారు అంటూ ఈ లేఖలో ఆయన వివరంగా రాస్తాడు.

ఈ సందర్భంలోనే నరసయ్య తన వాదనకు శక్తినిచ్చే మరొక ఉదంతాన్ని ఉదాహరిస్తాడు. మద్రాసు సముద్రతీరంలో ధాన్యం గిడ్డంగులున్న వీధి, పొద్దస్తమానం ధాన్యం వ్యాపారులతో కిటకిట లాడుతూ ఉంటుంది. అక్కడ అనాదిగా ఇటువంటి పరిస్థితి ఉంది. ఒకరోజు మునిసిపాలిటి ఇన్‌స్పెక్టరు ఆకస్మికంగా చాలామంది ధాన్యం వ్యాపారులను అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్తాడు. ఆ దారిలో వచ్చేపోయే వాహనాలకు ఈ వ్యాపారులు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో మేజిస్ట్రేటు పెద్ద మొత్తం జుల్మానా విధిస్తాడు. ఈ తీర్పును విమర్శిస్తూ మద్రాసులో పత్రికలన్నీ గగ్గోలు పెడతాయి. ప్రజల తరపున ప్రభుత్వానికి ఎన్నో మహజరులు అందుతాయి. ఇంత జరిగినా ప్రభుత్వం మేజిస్ట్రేట్ చర్యనే బలపరుస్తుంది. చట్టం తన విధిని తాను నిర్వహించాలనడానికి నరసయ్య ఈ సంఘటనను ఉదాహరిస్తాడు.

వేపనూనె తయారు చెయ్యడం వంటి వృత్తులు ప్రమాదకరమైనవి (ఇరుగు పొరుగు ప్రజల ఆరోగ్యానికి). ఈ వృత్తులు కొనసాగించే వారి వద్ద లైసెన్సు ఫీజు (Licence