పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

49


బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని నరసయ్య చేసిన ప్రతిపాదనను బోర్డు సభ్యులు ఆమోదించారు.24 ఆ ఏడే, ఆగస్టు 5వతేది జరిగిన బోర్డుసమావేశానికి కోటయ్యసెట్టి, నరసయ్య హాజరయ్యారు. 'లోకలు ఫండు స్కూళ్ళకు ఒక కుటుంబము తాలూకు విశేషమంది చిన్నవాళ్ళు వచ్చిన యడల మామూలు ఫీజులో సగమే తీసుకొనేటట్టు ఉత్తర్వు చేయవలసినదిగా నెల్లూరు డిపిటీ స్కూలు యినిస్పెక్టరువారు చేసిన దరఖాస్తుకు సభికులలో అనేకులు వొప్పుకోనందున తోసివేయడమైనది.” అని ఒక తీర్మానం ఉంది. కోటయ్యసెట్టి ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, తన అసమ్మతిని లిఖితపూర్వకంగా తెలియచేశాడు. భూస్వామ్య వర్గం నుంచి బోర్డుకు నామినేట్ చేయబడిన ముగ్గురు సభ్యులూ కోటయ్యసెట్టి ప్రతిపాదనను వ్యతిరేకించారు.25 ఇప్పుడు స్వల్ప విషయాలుగాతోచే, ఈ చిన్న చిన్న రాయితీలకోసం నిజాయితీగా కృషిచేసిన అధికారులు ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారో ఈ సంఘటన నిరూపిస్తుంది. 1875 జూన్ మొదటివారంలో జరిగిన బోర్డు సమావేశంలో కోటయ్యసెట్టి, నరసయ్య పాల్గొన్నారు.26 నరసయ్య హాజరైన చివరి బోర్డు సమావేశం ఇదే. ఆ తర్వాత నెల్లూరు జిల్లాగెజిటులో ఆయన పేరు కన్పించలేదు. అసైలం ప్రెస్ ఆల్మనాక్‌లో కూడా 1875 తర్వాత డెప్యూటీ స్కూల్ ఇన్‌స్పెక్టర్ల జాబితాలో నరసయ్య పేరు కన్పించలేదు. 1876 నవంబరు 10వ తారీకున జరిగిన బోర్డు సమావేశం ఒంగోలు డెప్యూటీ స్కూల్ ఇన్‌స్పెక్టరు హోదాలో సి.ఎస్. నారాయణరావు, 1879 నవంబరు 1వ తారీకు సమావేశంలో సి. కుప్పుస్వామి అయ్యరు పాల్గొన్నట్లు గెజిటులో ఉంది. నరసయ్య నెల్లూరు కోర్టు వాజ్మూలంలో "Before I settled in Madras in April 1881, I was employed in this district" అని పేర్కొన్నాడు. నరసయ్యకు తారీకులు, సంవత్సరాలు అన్నీ చిన్నవివరాలు కూడా తప్పిపోకుండా, నిర్దుష్టంగా వివరించే అలవాటుంది. దినచర్యలో ప్రతి విషయం స్పష్టంగా రాశాడు. బహుశా గృహచ్చిద్రాలు, ఇతర కారణాలవల్ల 1876-81 మధ్యకాలంలో తరచుగా సెలవుమీద ఉండడంవల్ల ఆయన స్థానంలో ఇతరులు పనిచేసి ఉంటారని భావిస్తున్నాను. మొత్తంమీద కోటయ్యసెట్టి సాహచర్యంలో నరసయ్య నెల్లూరుజిల్లాలో విద్యాభివృద్ధికి పాటుపడ్డాడు. ఆయన జీవితంలో ఇది ముఖ్యమైన కాలం. వ్యక్తిత్వం రూపుదిద్దుకొంటున్న కాలం.

నరసయ్య ఒంగోలు జీవితం

నరసయ్య కష్టాలు 1875లో మొదలయ్యాయి. ఉద్యోగజీవితంలో, కుటుంబ విషయాల్లో అన్నీ ఇబ్బందులే. ఈ సమయంలోనే ఆయన సెలవు పెట్టి, రెవెన్యూ బోర్డులో ప్రవేశించడానికి ప్రయత్నం చేసినట్లు చెప్పడానికి ఆధారాలున్నాయి. ఈ ఉద్యోగ విషయంగా నరసయ్య ప్రయత్నాన్ని తెలియచేసే ఒక ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరం