పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

దంపూరు నరసయ్య


రాశాడు. ఆ సంపాదకీయంలో మద్రాసు ప్రసిద్ధ పత్రికలను ప్రస్తావిస్తూ, పత్రికలకు పుట్టుక, చావు రెండూ సహజమే అంటూ ఈ విధంగా రాశాడు. .... సూర్యాలోకము పుట్టుటచే ఎవరికే గొప్ప లాభము కలిగెను? గిట్టెనేమి ఎవరికేమి నష్టము? రమారమి 25 సంవత్సరములకు ముందు “అథీనియం అండ్ డెయిలీ న్యూస్” అనబడు ఆంగ్లేయ దినవర్తమాన పత్రిక యొకటి యుండెను. అది జాన్ మిల్లర్ మొదలగు గొప్ప దొరలచే జరిపించ బడుచుండెను. చెన్నపురి గవర్నరులలో విశేషఖ్యాతి చెందిన లార్డ్ నేపియర్ గారితో దెబ్బలాడి, కోర్టుకెక్కి అపరాధమిచ్చి, మరునాడు శ్రీవారిని మరల నెదుర్కొని పత్రికా లేఖకులకుండు హక్కును స్థాపించెను. అట్టి పత్రిక యేమాయెను? దాని పేరు గూడా లుప్తమాయెనుగా !!! మె|| దంపూరు నరసయ్యగారిచే రమారమి 30 సం||లకు ముందు నేటివ్ అడ్వొకేట్ అనబడు నాంగ్లేయ వారపత్రిక యొకటి యారంభించబడెను. మన రాజధానిలో హిందువులలో, ఆంగ్లేయ భాషలో పత్రికను ప్రకటించుటకు ప్రారంభించినవారు ప్రప్రధమమున శ్రీ నరసయ్యగారే. వీరి పేరిపుడెవరికైనా తెలియునా?"

గోమఠం శ్రీనివాసాచార్యులు రాసినట్లు మద్రాసులో ఒక ఇంగ్లీషు పత్రికకు సంపాదకత్వం వహించిన తొలి దేశీయుడు నరసయ్య కావచ్చు. మద్రాసు పత్రికల చరిత్ర రాసిన వారెవరూ ఈ విషయాన్ని చర్చించలేదు. 1840 ప్రాంతంలో సి. నారాయణస్వామినాయుడు నేటివ్ ఇంటర్‌ప్రిటర్ (Native Interpretor) పత్రికను స్థాపించినా, ఆయన ఆ పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించాడో లేదో ఎవరూ స్పష్టంగా పేర్కొనలేదు. సి. వెంకటరాయులునాయుడు రైసింగ్ సన్ పత్రికను ప్రారంభించాడు. ఆయన తన పత్రికలోనే కాక, ఆనాటి ఇతర పత్రికలలో కూడా రాస్తూ వచ్చినట్లు తెలిసింది. ఒక ఇంగ్లీషు పత్రికకు సంపాదకుడైన మొదటి దేశీయుడు వెంకటరాయులునాయుడే అయి ఉండాలి. ఆయన తెలుగువాడు. ఆయన పత్రిక రైసింగ్ సన్‌కు మరొకరెవరైనా సంపాదకుడుగా వ్యవహరించి ఉంటే, మద్రాసులో ఒక ఇంగ్లీషు పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించిన మొదటి స్థానికుడు నరసయ్యే అని తీర్మానించవచ్చు.

నేటివ్ అడ్వొకేట్‌ను ప్రస్తావించిన రెండో సమకాలికుడు ఒంగోలు వెంకటరంగయ్య. “చిన్నతనమున మద్రాసులో నుండగా నేటివ్ అడ్వొకేట్ (Native Advocate) అను నాంగ్లేయ పత్రికను సాగించుచుండిరి. అద్దాని జాలించి కీర్తిశేషులగు వెంకటగిరి మహారాజా రాజగోపాలకృష్ణ యాచేంద్రుల వారికి ఇంగ్లీషు ఉపాధ్యాయులుగా వెంకటగిరి చేరిరి” అని రాశాడు.4

తమిళనాడు ఆర్కైవ్స్‌లో నేటివ్ అడ్వొకేట్ పత్రిక అధిపతి డి. కృష్ణయ్య మద్రాసు