పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

నేటివ్ అడ్వొకేట్

కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె మరణించిన తర్వాత ఆయన అనుచరుడు సి. వెంకటరాయులు నాయుడు ‘రైసింగ్ సన్' పత్రిక ప్రారంభించి, సంఘ సంస్కరణ, ఉదార విద్యావ్యాప్తి, లౌకికభావాలు ప్రోత్సహించడానికి కృషి చేసినట్లు, ఈ పత్రిక నిలిచిపోయిన తర్వాత, 1860 దశాబ్దంలో ఆరంభమైన నేటివ్ అడ్వొకేట్ ఆ ఆశయాలను కొనసాగించిందని, ఈ పత్రిక ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పడం తప్ప సుందరలింగం వివరాలేమీ ఇవ్వలేదు.1 అసైలం ప్రెస్ ఆల్మనాక్ 1867, 68, 69 మూడు సంపుటాల్లోని పత్రికల జాబితాలో ఈ పత్రిక పేరు కన్పించలేదు.

ఇద్దరు నరసయ్య సమకాలికులు నేటివ్ అడ్వొకేట్ పత్రికను గురించి రాశారు. వీరిలో మొదటి వాడు గోమఠం శ్రీనివాసాచార్యులు.2 మద్రాసులో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ, రచయితగా, నటుడుగా, నాటకప్రయోక్తగా ప్రసిద్ధి పొందాడు. కొంత కాలం సూర్యాలోకం పత్రిక నడిపాడు.3 నరసయ్యను బాగా ఎరిగినవాడు. సూర్యాలోకం పత్రిక రెండేళ్ళు పూర్తిచేసుకొని, మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో 1901 జూలై 18 సంచికలో తన ప్రత్యర్థి వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని 'స్వవిషయము' అనే శీర్షిక పెట్టి గొప్ప సంపాదకీయం