పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

దంపూరు నరసయ్య


ప్రదర్శించి, పరస్పర విరుద్దమయిన రెండు నిశ్చయాలకు రాగలుగుతున్నాము. ఒకే గ్రంథంలో విషయాన్ని ఉటంకించి, మన మతంలో వివిధ శాఖలకు, తెగలకు చెందినవారం రకరకాల సూత్రీకరణలు చేస్తున్నాము. హిందూశాస్త్రులు ఒక సూత్రీకరణను ఉదాహరించి, పరస్పర విరుద్ధమైన నిర్ధారణలకు వస్తారు. ఎవరు సరైనఅర్థం చెప్పారో, ఎవరు తప్పుఅర్ధం చెప్పారో నిశ్చయించడం చాలా కష్టం. బాధాకరమే, అయినా ఆ ఇబ్బందిని స్పష్టంగా అధిగమించగలిగాము. రంగనాథశాస్త్రి, ఆయన మిత్రబృందం తమవాదాన్ని సమర్ధించుకోడానికి తప్పు ఆకరాలను చూపించారు. మనువచనానికి వెంకన్నశాస్త్రి చెప్పిన అర్ధం ఒక్కటే సరైనది. రంగనాథశాస్త్రి, కాకపోతే ఆయన మిత్రుడు అనంతరామశాస్త్రి తాను చూపిన ఆధారాలకు, చిత్రంగా తర్క విరుద్దమైన అర్థాలను రాబట్టాడు. వెంకన్నశాస్త్రి తన ప్రత్యర్థి ఉదాహరించిన మనువాక్యాలనే ఉటంకించి, ఆయన వాదాన్ని తిప్పికొట్టాడు. వెంకన్నశాస్త్రివర్గం సమర్ధవంతంగా తమవాదాన్ని వినిపించినందుకు వారియోగ్యతను గుర్తిస్తున్నాము.

ఈ వాదం ప్రధానంగా మనుస్మృతి మీద ఆధారపడి కొనసాగించబడింది. సంస్కృత మాతృకను పరిశీలించినా, తమిళ అనువాదాలను, ఇతర భాషల నుంచి ఇంగ్లీషులోకి చేయబడ్డ అనువాదాలను చదివినా, మనుస్మృతి హిందువులకు బాల్య వివాహాలను విధించినట్లు తెలుస్తుంది. మూడు వేల సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది.

ఇప్పటివరకూ బాల్యవివాహాలను సమర్థించేవారితో కలిసి వాదించాము. ఇప్పుడు బాల్యవివాహాలను వ్యతిరేకిస్తున్న వారితో కలిసి వాదించడానికి సిద్దంగా ఉన్నాము. (మేము విన్న ప్రకారం, ఈ వర్గంవారు మేము అనుసరిస్తున్న పద్ధతి ప్రకారం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వాదించమని మమ్మల్ని కోరలేదు.)

ఏనాటివో పురాతన ధర్మశాస్త్రాలు బాల్యవివాహాలను అనుమతించి, ఆదేశించాయని, ఈ సంప్రదాయం ఎంతో కాలంగా కొనసాగుతున్నదనే సాకు చూపి, ఈ దురాచారం కొనసాగాలని చెప్పడానికి వీలులేదు. ఒకసంప్రదాయం నాగరికత పురోభివృద్ధికి అడ్డంకిగా నిలిచినా, విద్యావ్యాప్తిని అడ్డుకొన్నా, అనాదిగా కొనసాగుతున్న అపోహలను సమూలంగా పెకలించే ప్రయత్నానికి అవరోధమైనా, దాన్ని కొనసాగించవలసిన పనిలేదు. బ్రతుకులో స్త్రీని అర్హమైన స్థితిలో, నిజమైన స్థానంలో నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో సంప్రదాయం అడ్డు నిలిస్తే, అటువంటి సంప్రదాయాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ఒక సమాజ అవసరాలను, ఆకాంక్షలను నెరవేర్చిన తర్వాత ఆ సంప్రదాయాలు, అపేక్షలు, ఆకాంక్షలు పాతపడి, తర్వాత కాలానికి కొరగాకుండా పోతాయి, ఉపయోగపడవు. మనం చేసే కార్యాలన్నీ పూర్వుల సంప్రదాయానుసారం, వాడుక అనుసరించి ఉండాలనుకొంటే పురోగమనం అనే పందెంలో ఎక్కడో వెనకబడి పోతాము. యుగయుగాలుగా ఇది