పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

లెటర్స్ ఆన్

హిందూ మేరేజస్

బ్రహ్మసమాజ భావాలు

1864 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కేశవచంద్రసేన్ మద్రాసులో ఉన్నాడు. బ్రహ్మసమాజ భావాలను ప్రచారం చెయ్యడానికి అక్కడ కొన్ని ఉపన్యాసాలు చేశాడు. ఆయన గొప్పవక్త. తన ఉపన్యాసాలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించమని, కులనిర్మూలన చెయ్యమని, సంస్కరణోద్యమాన్ని కొనసాగించడం కోసం సంఘాలు స్థాపించమని ఉద్బోధించాడు. ఆయన ఉపన్యాసాలు హిందూయువకులమీద, విద్యార్థులమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. చైతన్యవంతులను చేశాయి.1 “హిందూమతానికి వేదకాలంనాటి ఔన్నత్యం తిరిగి కలిగించడం” అనే బ్రహ్మసమాజ భావన విద్యావంతులను ఆలోచింపచేసింది. కేశవచంద్రసేన్ మద్రాసులో ఉపన్యసించిన మూడునెలల లోపలే, బెంగాల్ బ్రహ్మసమాజం నమూనాలో మద్రాసు వేదసమాజం ప్రారంభమైంది. సభ్యులు ఏకగ్రీవంగా సమాజ నిబంధనలు తయారుచేశారు. ఆస్తికత, ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన మానడం, కులభేదాలను విస్మరించడం, మతద్వేషాన్ని విడిచిపెట్టడం, స్త్రీ విద్య, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, దేశ భాషలలో పుస్తక ప్రచురణ మొదలైనవి ఈ సమాజ ఆశయాలు.