పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

239


నరసయ్య జీవితంలో ముఖ్యమైన తారీకులు

పుట్టినరోజు : 25 సెప్టెంబరు 1849 - మహర్నవమి పండుగరోజు

పుట్టిన ఊరు : మద్రాసు

మెట్రిక్యులేషను పరీక్ష పాసయిన సంవత్సరం : 1864

తండ్రి మరణం : 1866-67

మద్రాసు పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా : 1867

లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్ ప్రచురణ : 16 మార్చి 1867

నేటివ్ అడ్వొకేట్ పత్రిక సంపాదకత్వం : 1867-69

వెంకటగిరి సంస్థానంలో ఇంగ్లీషు ట్యూటరు ఉద్యోగంలో ప్రవేశం : 1869 దీపావళి రోజు

వెంకటగిరి యూనియన్ స్కూల్లో ఉపాధ్యాయుడుగా : 1870

నెల్లూరు కలెక్టరాఫీసులో హుజూరు ట్రాన్సులేటరుగా నియామకం : 4 జనవరి 1871

నెల్లూరు పయొనీర్ పత్రిక సంపాదకత్వం : 1871-1872

నెల్లూరు సెషన్స్ కోర్టులో ఆనరరి జూరరుగా నియామకం : 17 ఫిబ్రవరి 1872

ఒంగోలు రేంజి డెప్యూటీ స్కూల్స్ ఇన్‌స్పెక్టరు ఉద్యోగం : 1872 - 1881

మద్రాసులో పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్సు, పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ప్రారంభం : 1వ తారీకు ఏప్రిల్ 1881

వీరేశలింగం దంపతులతో సంస్కార భోజనం : 1882

కుమారుడు రామకృష్ణయ్య జననం : 11 ఏప్రిల్ 1888

కుమారుణ్ణి అక్క మీనాక్షమ్మకు దత్తత : 1892

పీపుల్స్ ఫ్రెండ్‌లో కన్యాశుల్కం సమీక్ష : 21 జనవరి 1897

పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక నిలిచిపోవడం : ఆగష్టు 1897

నెల్లూరు కాపురం : 1897 - 1902

కోడూరు భట్టారంవారి కండ్రిక కాపురం : 1903 నుంచి

కోడూరు కాపురం : 1906

కోడూరు గ్రామ మునసబుగిరి : 1906 జనవరి నుంచి ఏప్రిల్ చివరవరకు

వెంకటగిరి కాపురం : 1907

మరణం : 28 జూన్, 1909

భార్య రామలక్ష్మమ్మ మరణం : 1913

నరసయ్య పత్రికలమీద ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రికలో ఒంగోలు వెంకటరంగయ్య వ్యాసం : 1922