పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

169


రెవెన్యూ బోర్డులో ఉద్యోగాన్ని ఆశిస్తూ నరసయ్య రాసుకొన్న జాబుకు శుష్క సానుభూతి, శూన్యహస్తాలతో జవాబిది. ఇది రాసిన ఆంగ్లేయుడి పేరు కూడా స్పష్టంగా తెలియడం లేదు .....

1900లో నరసయ్యగారు మద్రాసునుండి నెల్లూరు వచ్చి ఆంధ్రభాషా గ్రామవర్తమాని అనే పత్రిక ప్రారంభించాడని వెంకటరంగయ్యగారు రాశారు. దానికి సంబంధించిన దాఖలాలు నరసయ్య డైరీలో కనుదగులుతాయి. 1901 జూన్ 25వతేది తన డైరీలో ఆయన ఇట్లా రాసుకొన్నాడు. Sunday - Monday and half of Tuesday engaged in writing leaders, picking up news and writing for the issue of “గ్రామవర్తమాని” for 25th May and 1st June 1901... By Tuesday afternoon work of గ్రామవర్తమాని. of 25th May fully set up.

మే 25, జూన్ ఒకటవ తేది రెండు వారాల పత్రికను ఒకటే పర్యాయం ప్రకటించడం, అదీ ఒక నెల ఆలస్యంగా ప్రకటించడాన్ని బట్టి గ్రామవర్తమాని ఎన్ని ఇబ్బందుల్లో ప్రచురిత మవుతుండినదీ ఊహించుకోవచ్చు.

దంపూరి నరసయ్య జీవిత చరిత్రకు సంబంధించి నాకు దొరికిన ముడిసరుకు ఇది. చివరన ఒకమాట. నార్ల షష్టిపూర్తి సందర్భంగా వెలువరించిన "Some aspects of Telugu Journalism" తప్ప, అందులోనూ ముఖ్యంగా ఆరుద్ర వ్యాసం తప్ప తెలుగు జర్నలిజం చరిత్రను కూలంకషంగా పరిశోధించిన పాపాన ఎవరూ పోలేదు. ఆ కృషి జరగవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మనవి. నెల్లూరు పత్రికారంగంలో ఆద్యుడైన దంపూరి నరసయ్య ఒక్క పత్రికా రంగానికేగాక, సంఘసంస్కరణలోనూ ప్రముఖుడు. కందుకూరు వీరేశలింగంగారి సంఘ సంస్కరణోద్యమంలో నరసయ్య పాత్రకూడా ఉంది. మద్రాసులో వీరేశలింగంగారు ఏర్పాటుచేసిన సహపంక్తి భోజనానికి హాజరైన ఆరుగురిలో నరసయ్యగారొకరు. అటు తర్వాత ఆయన వెంకటగిరిలో ఒక వితంతు వివాహం జరిపినట్లు కొన్ని దాఖలాలున్నాయి. మొత్తం మీద నరసయ్యగారి జీవితచరిత్రను సమగ్రంగా పరిశోధించి గ్రంథస్తం చేయడం ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.

(పెన్నేపల్లి గోపాలకృష్ణ, జమీన్‌రైతు 13-7-1979)

కోర్టు సాక్ష్యం, 1,2 ఉత్తరాలు విడిగా అనుబంధంలో చేర్చబడ్డాయి.

నెల్లూరఁ బత్రికా ప్రచారము

“నెల్లూరు పయొనీర్” (Nellore Pioneer) అనునది పత్రికా ప్రపంచమున నెల్లూరు వెలసిన ప్రప్రథమ పత్రికా పుత్రికగా గన్పట్టుచున్నది. ఇయ్యది గత శతాబ్దపు టరువదియవ దశకాంతమున నంబెరుమాళ్ళయ్య, దంపూరి నరసయ్య యను నిద్దఱాంగ్లేయ భాషా