పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

159


నిర్వహించాడు. ఈ సమావేశంలో ఒంగోలు డివిజన్‌లో క్రింది తరగతుల్లో అమల్లో ఉన్న పాఠ్య ప్రణాళికమీద నరసయ్య తయారు చేసిన నివేదిక పరిశీలించబడింది. యూనియన్ స్కూళ్ళ నిర్వహణకు సంబంధించి కొన్ని నిబంధనలు విధించాలని, ఇన్‌స్పెక్టింగ్ మాస్టర్ల పనివిధానంపై కొన్ని సూచనలు జారీ చెయ్యాలని ఆ నివేదికలో నరసయ్య కోరాడు.

L. Nellore District Gazette, August 23rd 1873, Local Fund Board Sheet, Page 29.

సారాంశం : ఆగస్టు 7వ తారీకున నెల్లూరులో జరిగిన బోర్డు సమావేశానికి కోటయ్యసెట్టి, నరసయ్య హాజరయ్యారు. ఈ సమావేశానికి వేన్స్ ఏగ్ను అధ్యక్షత వహించాడు.

M. Nellore District Gazette, October 18th 1873, Local Fund Board Sheet, Page 87.

సారాంశం : ఇంటిపన్ను వసూళ్ళు నిలిపి ఉంచినందువల్ల మాతృభాషలో విద్యాబోధన జరుగుతున్న స్కూళ్ళలో నెలజీతం 4 అణాలు వసూలు చేయవలసినదిగా బోర్డు మీటింగులో నిర్ణయించారు. నాయుడుపేట, వెంకటగిరి స్కూళ్ళకు ఈ వసూళ్ళనుంచి మినహాయింపు ఇవ్వబడింది.

N. Nellore District Gazette, November 15th 1873, Page 404.

"Notice. Wanted a writer for the office of the undersigned - salary Rupees 15 per mensem, with mileage at 2 annas a mile when on circuit. Only matriculated students, who can write a good hand in English and Telugu, need apply to the undersigned upto 5th December, 1873.

D. Narasaya

Deputy Inspector of Schools,

Ongole Range, Nellore District."

0. Nellore District Gazette, March 17th 1874, Local Fund Board Sheet, Page 18.

సారాంశం : ఫిబ్రవరి 5వ తారీకు బోర్డు సమావేశంలో మెజారిటీ సభ్యులు ఒంగోలు, కావలికొత్తపాళెం, కావలి, గూడూరు, వెంకటగిరిలో బాలికాపాఠశాలలు ప్రారంభించాలని తీర్మానించారు. ప్రతివిద్యార్థిని నెలనెల అర్ధణా ఫీజు చెల్లించాలని, చురుకైన విద్యార్ధులకు చిన్న చిన్న స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని తీర్మానించారు. కోటయ్యసెట్టి విద్యార్థినుల వద్ద ఫీజు వసూలు చేయరాదంటూ తన అసమ్మతిని రికార్డు చేశాడు. నెల్లూరు, అల్లూరు, ఉదయగిరి, కావలి స్థానిక సభ్యులు (అందరూ భూస్వాములు, రెడ్లు) కోటయ్యసెట్టి