పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

139


సమస్యల పరిష్కారానికి కృషిచేశాడు. గ్రామీణులను వెంటపెట్టుకొని పై అధికారులను కలిసి మహజరులు ఇచ్చాడు. వారి సమస్యలమీద పత్రికలకు రాశాడు.19 తాసిల్దారు కోరిక ప్రకారం 1906 జనవరి నుంచి నాలుగైదు నెలలు నరసయ్య కోడూరు గ్రామాధికారిగా (Village Munsif) పనిచేశాడు. నరసయ్య కుమారుడికి మైనరు తీరగానే అతణ్ణి గ్రామాధికారిగా ప్రభుత్వం నియమించింది.20 నరసయ్య వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడానికి దినచర్యలో పేర్కొనబడిన ఈ సంఘటన ఉపకరిస్తుంది. ఎవరో ఒక దిక్కులేని ఆదివాసి స్త్రీని కొట్టారు. ఆయన కుమారుడు ఆరేడు మైళ్ళు నడిచి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఈ విషయం దినచర్యలో రాశాడు.

"6 a.m. got up at 6 awakened by the noise created by a row between జంగం వెంకటసుబ్బడు and యేనాది అంకి on account of some money due by latter to former. I advised former to collect the money in a legal and amicable manner. He, advised by his brother పిచ్చివాడు dragged the woman away forcefully. We (I and BRK) complained to S.H.O Indukurpet who advised the fellows not to do such things any further."21

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్సు చాలా పెద్దది. దాన్ని అమ్మి ఉంటే ఆయన బాకీలన్నీ క్షణంలో తీరిపోయేవి. ప్రెస్సు ఆయన బహిః ప్రాణం. "when will my Heavenly Father enable me to pay off commitment and pay the creditors and resume my printing work" అని భగవంతుణ్ణి వేడుకుంటాడు. "Mercy Heaven wish me to pay off my creditors and work my press, etc.," అని ప్రెస్సు పునరుద్ధరించే రోజు గురించి ఆశగా ఎదురు చూస్తాడు.22

ఈ దినచర్యలో నరసయ్య నిస్సహాయమైన పరిస్థితులు వెల్లడి అయ్యాయి. 1906 అక్టోబరు 23 దినచర్య పుటలో ఆయన రాసిన ఈ వాక్యాలతో విషయాన్ని ముగిస్తాను.

"In my wife's illness, sister's helplessness, debts, difficulties of cultivation, etc., I require God's help."

చివరి రోజులు

1907లో తోడల్లుడు రాపూరు ఆదినారాయణయ్య అండదండలతో నరసయ్య వెంకటగిరిలో స్థిరపడ్డాడు.23 అక్కడ ఆయన అచ్చాఫీసు వ్యాపారం ఏ పాటిగా జరిగిందో తెలియదు. అప్పటికి ఆర్ధిక ఇబ్బందులన్నీ తొలగి పోయినట్లుంది. పది సంవత్సరాలు రుణబాధతో, కుటుంబ చిక్కులతో సతమతమయి పోయినందువల్ల అరవైఏళ్ళకే వృద్దాప్యం ఆయనను లోగొంది. తనకు "మధుమేహవ్యాధి లేదని” ఒక మిత్రునికి రాసిన లేఖలో