పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

దంపూరు నరసయ్య


విస్మరించడు. స్వయంగా తాను కాయకష్టం చేస్తాడు. 1905 జనవరి 7వ తారీకు దినచర్య ఇట్లా ఆరంభం అవుతుంది.

"I rose as usual and walked through our pasture lands and had there cattle droppings collected carefully till 10 a.m."

రాత్రి, పగలు, వర్షాగమనం, శీతాకాలం, వేసవి ప్రకృతిలో వచ్చే మార్పులు అన్నీ దినచర్యలో రాశాడు. పైరుపంటలన్నా, పశువులన్నా ఆయనకు ప్రాణం. పశువులకు పేర్లు పెట్టుకొని పిలిచేవాడు. "Calf born to our cow (పుల్లావు or పుల్లి) which we named “సూర్యనారాయణ” అని ఒక పుటలో రాశాడు. పిచ్చిరామయ్య, మంగ, రామస్వామి ఎద్దులపేర్లు. “పుల్లావు కూతురు గయ్యాళి గౌరి”. రత్నమ్మ, అమ్మాయమ్మ పెయ్య దూడల పేర్లు, ఒక కోడె పేరు వెంకటేశ్వరులు. ఇంకో కోడెదూడ పేరు “లక్ష్మీనారాయణుడు”. ఒక ఆవు ఈనితే ఆ దూడకు సీత అని నామకరణం చేశాడు.16 తల్లిలేని దూడకు 'శంకరయ్య' అని పేరు పెట్టి సాకాడు. కుటుంబ సభ్యులు వెంట ఉండి రైల్లో శంకరయ్యను వెంకటగిరి తీసుకొని పోతారు. శంకరయ్యకు జబ్బు చేస్తుంది. ఈ వార్త తెలిసి నరసయ్య ఎంతగానో దుఃఖిస్తాడు. వెంకటగిరి వెళ్ళి శంకరయ్యను చూచి వస్తాడు. "Saw శంకరయ్య How miserable is the poor creature's present condition" అని దినచర్యలో రాసుకొన్నాడు. శంకరయ్య మరణ వార్త తెలుస్తుంది. “శంకరయ్య the orphan calf brought up by us ...............) died. God ! have mercy upon him (this) poor soul !" అని శోకిస్తూ రాశాడు.17 'లక్ష్మయ్య' అని పిలుచుకొనే ఎద్దుకు 'ముసర' వ్యాధి సోకుతుంది. అన్ని కష్టాల మధ్య నలిగిపోతున్న నరసయ్య ఈ విషయాన్ని దినచర్యలో రాయడం మరచిపోలేదు. "God is great and his decisions are mysterious and inscrutable, My bullock named లక్ష్మయ్య seems to have been suddenly taken ill last night. Only God (.....................) may take care of this poor beast" అని రాశాడు.18

కోర్టు వ్యవహారాలు

గురజాడ విలువైన కాలం జమీందారీ వారసత్వ దావాలతో వృథా అయినట్లు, నరసయ్య చివరి పదేళ్ళ జీవితం కోర్టు వ్యాజ్యాలతో సరిపోయింది. ఆంధ్రభాషా గ్రామవర్తమాని నడుపుతున్న రోజుల్లో ఆయన పేదలపక్షాన నిలబడి, భూస్వాములకు, గ్రామాధికారులకు వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు. విద్యాధికుడు, పేరున్నవాడు కావడంవల్ల ప్రభుత్వ అధికారులు ఆయనను గౌరవంగా చూచినా, స్థానిక భూస్వాములు ఆయన మీద కసిపెంచుకొని అనేక ఇబ్బందులు పెట్టారు. వీటన్నిటికి తోడుగా గృహచ్ఛిద్రాలు ఆయనను కలవరపెట్టాయి. ఇన్ని వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నా, గ్రామీణుల