పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

137


సంవత్సరాల దినచర్యలో ఏ దేవత ప్రస్తావన రాదు. “ఉపవాసం ఉంటే ఊరపందై పుడతార” ని పరిహాసంగా అనేవాడని ఆయన వంశీయుల వల్ల తెలిసింది. నరసయ్య మాదిరే ఆయన అన్న కృష్ణయ్య కూడా బ్రహ్మసమాజ ప్రభావంలో జీవించినట్లు అనిపిస్తుంది.

నరసయ్య మీద క్రైస్తవ ప్రభావం ఉంది. క్రిస్మసు సందర్భంగా దినచర్యలో రాసిన ప్రార్ధనలు ఈ విషయాన్ని సూచిస్తాయి.

"Sunday 24th December 1905 భ||వారి ఖండ్రిగ

May Xmas bring peace and rest for me and (.......) all."

"Monday 25th December 1905 భ||వారి ఖండ్రిగ

Xmas Day. May the (.........) and blessing of Christ rest upon this land, this village and all of us now in such a trouble! Rose at 6 A.M. and engaged in reading certain books of prayers in Sanskrit."

నరసయ్య 1906 ఏప్రిల్ 15 దినచర్య ముగిస్తూ, "Prayed to my Father in Heaven for his endeavour and protection" అని రాశాడు.

1884 సంవత్సరంలో మద్రాసు బ్రాహ్మణ సంఘం ప్రోత్సాహంతో పీఠాధిపతి వీరేశలింగాన్ని, నరసయ్యను మరికొంతమందిని (ఆరుగురు సంస్కర్తలు) సంఘ బహిష్కారం చేశాడు. 1905 నాటికి ఈ సంగతి పాతపడి పోయింది. మద్రాసు, నెల్లూరు, కోడూరు చుట్టుపట్ల గ్రామాల్లో బంధువుల ఇళ్ళలో శుభాశుభాలకు నరసయ్యను పిలుస్తూ వచ్చారు. నరసయ్య మిత్రుడు గండవరపు సుబ్బరామిరెడ్డి తమ కుటుంబసభ్యులు జరుపుకొంటున్న సమారాధనలో భోజనం చెయ్యమని కోరినట్లు, ఆ ఆహ్వానాన్ని మర్యాదాపూర్వకంగా తిరస్కరించి, 'మోయన' తీసుకోడానికి మాత్రం అంగీకరించినట్లు దినచర్యలో పేర్కొన్నాడు. వీరేశలింగంవంటి సంస్కర్త అనుష్ఠానిక బ్రాహ్మోగా మారింది 1906 తర్వాతనే అని గుర్తు చేసుకొంటే, నరసయ్య ఆచరణ ఆనాటి సంస్కర్తల ఆచరణకు దగ్గరగానే ఉన్నట్లు తెలుస్తూంది.

జీవకారుణ్యం

నరసయ్యకు పెద్ద వ్యవసాయం, పశుసంపద, భట్టారంవారి కండ్రిగ ఇంటి పెరడులో పశువులదొడ్డి, పొలాల్లో పశువుల కొట్టాలు, పశువులు తిరిగి రావడానికి అనువైన బీడుపొలాలు ఉండేవి. కోడూరు, కండ్రిగలో దగ్గర ఉండి టెంకాయ మొక్కలు నాటిస్తాడు. అరటితోట వేయిస్తాడు. పెరడులో మామిడి, కిచిలి మొలకలు నాటి పెంచుతాడు. పాలేర్లు, కూలీలు భోజనాలు చేసిన సంగతి కూడా దినచర్యలో రాయడం ఆయన