పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

135


ఆర్థికంగా చితికిపోయి, జీవితం సంక్షోభంలో ఊగిసలాడుతున్న పరిస్థితులలో కూడా ఆయన పుస్తకపఠనం నిరంతరాయంగా సాగించాడు. ఒకవైపు రుణదాతలను శాంతపరచడానికి టి.ఎం.ఓలు పంపుతూ, అదే చేత్తో పుస్తక ప్రచురణ సంస్థలకు టి.ఎం.ఓలు పంపి పుస్తకాలు తెప్పించుకొన్నాడు. మదరాసు వెళ్ళినపుడల్లా పుస్తకాలు కొనడం అలవాటు. కొత్తగా వచ్చిన పుస్తకాలకు కేటలాగు తయారుచేస్తున్నట్లు దినచర్యలో పేర్కొన్నాడు. ప్రతిరోజు పోస్టులో ఉత్తరాలు, పత్రికలు వి.పి.పార్సెళ్ళు వచ్చేవి. పోస్టుమాన్ రానిరోజు అసహనంతో “తపాలాశాఖ ఉండి ఏమి ప్రయోజనం” అని చిరాకు వ్యక్తంచేస్తూ పలుమార్లు దినచర్యలో రాశాడు. మద్రాస్ మెయిల్, ఆంధ్రప్రకాశిక, రీస్ అండ్ రయ్యత్ (Reis and Ryyet), ఇలస్ట్రేటెడ్ వీక్లీ (Illustrated Weekly) మొదలైన పత్రికలు క్రమం తప్పకుండా చదువుతున్నట్లు దినచర్యలవల్ల తెలుస్తుంది. "VPM చలమయ్య called and brought 1 paper, 1 magazine and 1 book-post from America" అని దినచర్యలో రాశాడు.11 వారం రోజుల తర్వాత "The History of Slavery and Success Movement in US of America" గ్రంథం చదువుతున్నట్లు దినచర్యలో ఉంది. లండన్ నుంచి పుస్తకాలబంగీ అందుకొన్నట్లు 1905 అక్టోబరు 25 దినచర్యలో ఉంది. వీరేశలింగం రచనలు, అనిబిసెంటు రచనలు, జేమ్స్‌మిల్ రచనలు, స్కూల్ కమిషన్ రిపోర్ట్ ఆన్ మద్రాస్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, జేనెట్ రిపోర్టులు, స్టరన్స్ రిపోర్టులు మొదలైన పరిపాలనా సంబంధమైన ప్రచురణలు చదువుతున్నట్లు దినచర్యలో పేర్కొన్నాడు. మూడు పైసల కరపత్రాలు - ఫెటర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ట్రేడింగ్ (The fetters of Christianity in Trading) హిస్టరీ ఆఫ్ క్రైస్ట్ (History of Christ), ది ఏజ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ గీతా (The age and Origin of Geeta) చదివినట్లు దినచర్యలో రాశాడు.12 ఇవి వందేమాతరం ఉద్యమనేపథ్యంలో వెలువడిన కరపత్రాలని అనిపిస్తుంది. ఈ కరపత్రాలు చదివినట్లు రాసుకొన్న కొన్ని గంటల తర్వాత “ది క్రిస్టియన్ ఇయర్” (The Christian Year) పుస్తకం చీకట్లు ముసురుకొనే వేళదాకా చదువుతూ కూర్చున్నాడు.14 ఏ.ఎస్. రే ఇంగ్లాండ్ అండ్ ఇండియా, (A.S. Ray's England and India) అమృత్ లాల్ రచన రెమినిసెన్స్‌స్, (Reminiscences) ఆర్.సి.దత్ హిస్టరీ ఆఫ్ బెంగాల్ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ (History of Bengal and Madras Presidency), ఇండస్ట్రియల్ లైఫ్ (..............) అండ్ కండిషనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సక్సెస్ (Industrial Life (................) and Conditioning of Industrial Success) మొదలైన చరిత్ర, రాజకీయ, ఆర్థికశాస్త్ర గ్రంథాలు చదువుతున్నట్లు దినచర్యలో ఉంది.14 'వాల్తెర్' (Voltair), క్రామ్‌వెల్ (Cromwell) అబ్రహాం లింకన్ (Abraham Lincoln) మొదలైన వారి రచనలు చదివినట్లు దినచర్యలవల్ల తెలుస్తూంది. డికెన్సు అమెరికన్ నోట్సు (American Notes) తో సహా డికెన్సు సాహిత్యం సమగ్రంగా అధ్యయనం చేసినట్టు దినచర్యలవల్ల