పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

దంపూరు నరసయ్య


ఇట్టి గ్రంథములు వ్రాయువారు పండితులుకాదని చెప్పెడువారు ఎంతమూడులో, ఎంతమూర్ఖులో, ఎంత దుర్వాదపరులో, ఎంత అసూయాపరులో ఊహించవచ్చును .............. మొన్న నాటకమును ప్రదర్శించిన సమాజము మెంబరులందఱు ఒకరిని మించిన వారొకరుగా నుండిరి. అయినను వారిలో దుష్యంతమహారాజు వేషమును ధరించినవారు అందరికంటే మిక్కిలి సమర్థులు. అతడు బాల్యదశలో నింత విద్యానైపుణ్యమును ఈషణ్మాత్రమైన సభాకంపములేక కనపఱచినందులకు మేమును, ఆటచూడవచ్చిన సభ యావన్మందియును చాల సంతసించితిమి.”

నరసయ్య తెలుగులో రాసినదేమి మిగలలేదు. అముద్రిత గ్రంథ చింతామణి పత్రికను ప్రశంసిస్తూ ఆయన ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో 'పేట్రియట్' పేరుతో ఒక సమీక్ష చేశాడు. అందులో రెండువాక్యాలను “ఇతరుల అభిప్రాయములు” అనే శీర్షికతో అముద్రిత గ్రంథ చింతామణి ప్రచురించింది. “పూండ్ల రామకృష్ణయ్యగారి అముద్రిత గ్రంథ చింతామణి దివ్యమైన పత్రిక యనుటకు నేలాటి యాక్షేపణ లేదు. సదరు అయ్యవారు మంచి పరిశోధకులు, బహు పాటుపడువారు.73 అముద్రిత గ్రంథ చింతామణి ఇచ్చిన రెండు వాక్యాలు వాడుక భాషలోనే ఉన్నాయి. 1897లో కన్యాశుల్కభాషను అంతగా స్వాగతించిన వ్యక్తి మూడేళ్ళలో అభిప్రాయాలు మార్చుకొని ఉండడు. గ్రాంథిక భాషావాదులు పత్రికలలో వచ్చిన రిపోర్టులను కూడా వీరగ్రాంథిక భాషలోకి మార్చి ప్రకటించుకొనేవారని భావించవచ్చు.