పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

దంపూరు నరసయ్య

వివరించాడు.6 ఈ వ్యాసంలోనూ నరసయ్య పత్రికల ప్రస్తావన లేదు. హిందూ శతజయంతి ప్రత్యేక సంపుటంలో (A Hundred Years of the Hindu) మదరాసీ పత్రిక ఎక్కువరోజులు కొనసాగలేదని పేర్కొంటూ, "Hotel'er it did not live long and another paper of the time, People's Friend suffered the same fate" అని పొడిమాటలు రాశారు.7 పత్రికారచయిత రేండర్ గై (Raider Guy) ఈ మాటలనే కొంచెం మార్పుచేసి "By the 1870's Madras had many Indian run newspapers, like Public Opinion, Madrassee and People's Friend. The going was tough for these national papers and so in 1878, these three publications merged to become "The Hindu" అని రాశాడు.8 హిందూ ప్రారంభమైన రెండున్నర సంవత్సరాల తర్వాతగాని, పీపుల్స్ ఫ్రెండ్ మొదలు కాలేదు. ఈ పత్రిక హిందుకూ సమాంతరంగా పదిహేడేళ్ళు కొనసాగింది. జె.నటరాజన్ తన సుప్రసిద్ధ గ్రంథం భారతదేశ జర్నలిజంచరిత్ర (History of Indian Journalism)లో ఈ పత్రికను 'పీపుల్స్ ఫ్రంట్' గా పేర్కొని, నెల్లూరు నుంచి వెలువడినట్లు చిత్రించాడు. "ఏ.ఏ.నాయర్ పీప్పు ఎట్ ది ప్రెస్ ఇన్ సౌత్ ఇండియా (Peeps at the Press in South India) లో "another paper the People's Friend, also failed for want of public support" అని రాశాడు.10

అకడమిక్ పరిశోధకుడు సి.జె. నిర్మల్ పరిశోధన “ది ప్రెస్ ఇన్ మద్రాసు 1785-1900" (The Press in Madras) లో, డాక్టరు నడిర్ కృష్ణమూర్తి “ఇండియన్ జర్నలిజం” (Indian Journalism) పరిశోధన గ్రంథంలోను నరసయ్య ప్రస్తావన కనిపించదు.11 పీపుల్స్ ఫ్రెండ్, నేటివ్ అడ్వొకేట్లను పేర్కొన్న మొట్టమొదటి అకడమిక్ పరిశోధకుడు ఆర్. సుందరలింగం. 1881లో పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభమైనట్లు స్పష్టంగా రాసినా, ఆయన కూడా నరసయ్య పేరు ప్రస్తావించలేదు.12 డి. సదాశివన్ తన పరిశోధన గ్రంథంలో "Another paper came to be founded was People's Friend. But all these papers disappeared in course of time" అని ముగించాడు.13

ఈ రచనలను అట్లా ఉంచితే, తెలుగు పరిశోధకుడు, విద్వాంసుడు ఆరుద్ర 1980 తర్వాత, “ఇంగ్లీషు జర్నలిజంలో తెలుగువారి ఘనత” అనే శీర్షికతో పెద్ద వ్యాసమే రాశాడు.14 అప్పటికి ఆయనకు నరసయ్యను గురించి, నరసయ్య పత్రికలను గురించి తెలుసు. తెలుగు పరిశోధకులు అడపా దడపా ఏదో ఒక సందర్భంలో నరసయ్య పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇంత అవగాహన ఉండీ, ఏ కారణంచేతో నరసయ్య కృషిని తన వ్యాసంలో ప్రస్తావించలేదు.

విశాలాంధ్ర ప్రచురణ సంస్థ మొదట గురజాడ ఇంగ్లీషు లేఖలను అవసరాల సూర్యారావుచేత అనువదింపచేసి ప్రకటించింది.15 ఆ పుస్తకంలో ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన ఒక లేఖలో నరసయ్య ప్రస్తావన ఉంది. ఈ సంస్థ గురజాడ