పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

3

మెలిగే వ్యక్తి. ఎవరికి జాబురాసినా, కార్డుముక్క రాసినా 'లెటర్ బుక్' లో కాపీ చేస్తే తప్ప, పోస్టుచేసేవాడు కాదు. కాపీ చెయ్యడానికి కుమారుడు అందుబాటులో లేకపోతే, ఉత్తరాలు పోస్టు చెయ్యకుండానే నిలిపి ఉంచిన వైనం దినచర్యలో రాసుకున్నాడు.4 తను అందుకున్న ప్రతి ఉత్తరానికి, పోస్టుకార్డుకు నంబరు వేసి భద్రపరచేవాడు. ఈ కరస్పాండెన్సు ఇప్పుడు లభించడం లేదు.

నరసయ్య మనుమలు వెంకటగిరి విడిచిపెట్టి నెల్లూరు కాపురం వచ్చినప్పుడు నరసయ్య పుస్తకాలలో కొంతభాగాన్ని పెద్ద భోషాణంపెట్టెలో పెట్టి, జాగ్రత్త చేసి బంధువుల అధీనంలో ఉంచారు. అవి తలా ఒకటి పట్టుకొనిపోయారు. పోయినవిపోగా మిగిలిన రికార్లు, పుస్తకాలు, లేఖలు, డైరీలు, నరసయ్య మనుమలు పత్రికలవారికి, పరిశోధకులకు ఇచ్చి రాయమని కోరుతూ వచ్చారు. పనప్పాకం అనంతాచారి, వీరేశలింగం మొదలైన ప్రముఖులు రాసిన లేఖలు, రికార్డు ఎవరెవరి చేతుల్లోనోపడి అదృశ్యమయ్యాయి.

పందొమ్మిదో శతాబ్దిలో మద్రాసు ప్రెసిడెన్సీలో వెలువడిన పత్రికల మీద, ముఖ్యంగా ఇంగ్లీషుపత్రికల మీద విస్తృతపరిశోధనలు జరిగాయి. మద్రాసులో పుట్టి, మద్రాసులో విద్యాభ్యాసంచేసి, అక్కడే అధ్యాపకుడుగా, పత్రికాసంపాదకుడుగా, సంస్కర్తగా జీవించిన నరసయ్య పేరైనా ఈ పరిశోధకులు ప్రస్తావించలేదు. క్రెసెంట్, నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మదరాసీ మాత్రమే వారి దృష్టిలో మైలురాళ్ళు. పీపుల్స్ ఫ్రెండ్ పుట్టుక, అస్తమయం అన్నీ వారి పరిశోధన గ్రంథాల్లో ఒకవాక్యంలో ఇమిడిపోయాయి. కనీసం నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక సంపాదకుడని కూడా ఎవరూ పేర్కొనలేదు. కొందరు ఈ పత్రిక 1878 కల్లా మూతపడినట్లు రాశారు.

మదరాసు నగరం మూడువందల సంవత్సరాలు పూర్తిచేసుకొన్న సందర్భంలో ఒక ప్రత్యేక సంపుటాన్ని (Tercentenary Commemoration Voltane) వెలువరించారు. అందులో కె.పి. విశ్వనాథఅయ్యరు మద్రాసు జర్నలిజంచరిత్రను రాస్తూ నేటివ్ పబ్లిక్ ఒపీనియన్ (Native Public Opinion) మదరాసీ (Madrassee) లతో పాటుగా పీపుల్స్ ఫ్రెండ్ ను ప్రస్తావించాడు. "Another paper of the time, The People's Friend, suffered similar fate" అని ఒక మాట అన్నాడు. పీపుల్స్ ఫ్రెండ్ ముందు వెలువడిన పత్రికాసంపాదకుల పేర్లను పేర్కొన్నా, నరసయ్య పేరు ప్రస్తావించలేదు.5 The Asylum Press Almanac, Madras 1882 సంపుటం నుంచి 1898 సంపుటం వరకు ప్రతి సంపుటంలోను పీపుల్స్ ఫ్రెండ్ మద్రాసు నుంచి వెలువడే ఇంగ్లీషు వారపత్రిక అని, డి. నరసయ్య ప్రకాశకుడని ఉంది. ఆల్మనాక్ ను సంప్రదించని పరిశోధకులు ఉండరు.

మెయిల్ దినపత్రిక నూరేళ్ళ సంచిక (Centenary Supplement, Mail) లో మాతృభూమి ప్రధాన సంపాదకుడు పి. కేశవమినన్ మద్రాసు జర్నలిజం చరిత్ర