పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1

అర్ధ సత్యాలు

అసమగ్ర ప్రయత్నాలు


నరుచేతను నా చేతను

వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్

ధరచేత శల్యుచేతను

నరయంగాఁగర్ణుఁ డీల్లె నార్గురచేతన్

(ఒక చాటుపద్యం)

నరసయ్య దురదృష్టవంతుడు. బతికినంతకాలం కష్టాలను కొనితెచ్చుకొని బతికాడు. దురదృష్టం చావు తర్వాత కూడా ఆయనను వెంటాడుతూనే వచ్చింది. జీవించినన్ని రోజులు ప్రజాశ్రేయస్సు కోసం పత్రికలు నిర్వహించిన ఆయన పేరు మద్రాసు జర్నలిజం చరిత్రలో ఎవరూ ప్రస్తావించలేదు. ఆయన కృషి కాలగర్భంలో కలిసిపోయింది. చివరకు ఆయన మరణవార్తను ఏ పత్రికా ప్రచురించినట్లు లేదు. వీరేశలింగం స్వీయచరిత్రలో “సంస్కరణాభిమాన షట్చక్రవర్తులు' అని వర్ణించిన ఆరుగురిలో నరసయ్య పేరు పేర్కొనకుండా ఉండి ఉంటే, లోకానికి ఆయన పేరు అసలు తెలిసేదే కాదు. గురజాడ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలో నరసయ్యను గురించి ప్రస్తావించడం వల్ల, పరిశోధకులు ఆయన మీద ఆసక్తి ప్రదర్శించారు.