పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

99


మునిసిపాలిటీలు” అనే వ్యాసం కూడా ఉంది. కోయంబత్తూరు జిల్లా అనే సంపాదకీయంలో ఆ జిల్లా భౌగోళిక, చారిత్రక విషయాలు వివరంగా చర్చించబడ్డాయి. ఈ వ్యాసం చివర, ట్రావెన్కూరు సంస్థాన వ్యవహారాల మీద రాసిన వ్యాసం చివర 'F' అని రచయిత సంగ్రహనామం ప్రచురించబడింది. 1883 డిసంబరు 1 సంచికలో "బెంగాల్ టెనెన్సీ బిల్లు" వ్యాస రచయిత కూడా ఈయనే. నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభించిన నాటి నుంచి ఒకరిద్దరు మిత్రులైనా రచనలు పంపి సహకరించినట్లు ఇందువల్ల స్పష్టమవుతూంది. నరసయ్య తన పాఠకులకు చేసిన ఒక విజ్ఞాపనలో "Monthly payment for articles in the People's Friend forms no inconsiderable item of our total expenditure" అని పేర్కొన్నాడు. ఈ ఒక్క సంచికలోనే హిందు, మద్రాస్ మెయిల్, ట్రిబ్యూన్,ది డెయిలి టెలిగ్రాఫ్, టైమ్ మేగజైన్, ఛేంబర్సు జర్నల్ వంటి అనేక జాతీయ అంతర్జాతీయ పత్రికలనుంచి వార్తలు, వ్యాసాలు పునర్ముద్రించాడు. వీటిలో కొన్ని పత్రికలకైనా చందాలు చెల్లించడం పత్రికా నిర్వహణలో భాగమే. రచయితలకిచ్చే పారితోషికంలో ఈ కర్చు కూడా చేరి ఉంటుంది.

అంజుమన్ ముఫ్‌ది ఇస్లాం

నరసయ్య ఉదారభావాలు, విద్యాభిమానం తెలియజేసే మరొక వార్త ఈ సంచికలో ఉంది. ఏటా 200 మంది ముస్లిం విద్యార్థులకు అంజుమన్ ముఫ్‌ది ఇస్లాం సంస్థ సాంకేతిక విద్యలో శిక్షణ ఇచ్చేది. ఈ సంస్థ 600 రూపాయల వార్షిక గ్రాంటు మంజూరు చేయమని మద్రాసు మునిసిపాలిటిని అర్థించింది. ఇదే విధంగా ఇతర సంస్థలు కూడా సహాయం కోరవచ్చనే నెపంతో మునిసిపాలిటి ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ విషయం మిద వ్యాఖ్యానిస్తూ ఇస్లాం మతస్థులు చదువుల్లో వెనకబడి ఉన్నారని, ఇంతమంది విద్యార్థులకు చదువుకొనే అవకాశం కలిగిస్తున్న ఈ సంస్థకు ప్రత్యేకంగా గ్రాంటు మంజూరుచేసి, ప్రోత్సహించి ఉండవలసిందని, ఇదేమి పెద్ద మొత్తంకాదని పీపుల్స్ ఫ్రెండ్ అభిప్రాయపడింది.

పీపుల్స్ ఫ్రెండ్ విజ్ఞాపన

ఈ సంచికలోనే నరసయ్య చందాదారులకు, పాఠకులకు చేసిన ఒక విజ్ఞాపన ఉంది. ఏడేళ్ళ పత్రికా నిర్వహణలో చందాదారుల నుంచి నాలుగువేల రూపాయలు బాకీ ఉన్నట్లు అందులో ఉంది. ఈ విజ్ఞాపన అనువాదం :

“సహృదయులారా! పాత కొత్త చందాదారుల నుంచి నాలుగువేల రూపాయల బకాయిలు ఉన్నాయి. అందులో సగం మొత్తం ఇప్పుడు చందాదారులుగా కొనసాగుతున్న వారి నుంచే రావాల్సి ఉంది. మిలో ప్రతి ఒక్కరు రేపటి రోజు చందా బాకీ చెల్లించగలిగితే, వెంటనే కొత్త అచ్చులు కొని పత్రికను ఆకర్షణీయంగా వెలువరించగలను. ఈ పరిస్థితిలో