పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

93


గౌరవప్రదమైన మా సోదర పత్రికలకు కల్పించిన సౌకర్యాన్ని మా పత్రికకు కూడా కలుగజేస్తారని భావిస్తాము. బహుశా మాది వారపత్రిక అని, నిరుపేద అయిన ఒక గుమాస్తాకు కూడా అందుబాటులో ఉండేంత తక్కువగా మా చందా రేటు ఉందని, అందువల్ల మా సర్క్యులేషను చాలా తక్కువ అని, మా పత్రిక ప్రభావం ఏమీ లేదని ప్రభుత్వం అభిప్రాయ పడినట్లుంది. వాదం కోసం దీన్ని నిజమనే అంగీకరించినా, ప్రభుత్వం మా విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించాలి. ప్రభుత్వ విధానాలను సమదృష్టితో విమర్శించి, ప్రచుర పరచడానికి అవకాశం ఇవ్వాలి.

ఈ ప్రెసిడెన్సీలో ఒక స్థానిక పత్రికగా హిందూ తర్వాత స్థానం మాదే. హిందూ అచ్చు వేసే ప్రతి మూడు సంచికలకు మేము ఒక సంచికను అందించ గలుగుతున్నాము. ప్రజాహిత సమస్యలను చర్చించే సందర్భాలలో, స్వేచ్ఛగా మా అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో, మితిమీరకుండా వ్యవహరించడంలో, జాగ్రత్త విషయంలో, నిజాయితీగా, ధైర్యంగా రాయడంలో, ప్రజల హక్కుల కోసం పోరాడడంలో మా కృషిని హిందూ కూడా గుర్తిస్తుందని భావిస్తాము."

5. మద్రాసు చట్టసభ - సంపాదకీయం

1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో ఎడిటోరియల్ నోట్సు శీర్షికలో నరసయ్య తన పేరు మీద ఈ వ్యాసాన్ని ప్రచురించాడు. ప్రభుత్వం మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలుకు వెంకటగిరి జమిందారు వెలుగోటి రాజగోపాలకృష్ణ యాచేంద్రను నియమించింది. ఈ నియామకాన్ని హర్షిస్తూ నరసయ్య వ్యాసం రాశాడు. నరసయ్య కొంతకాలం ఈ జమిందారుకు ట్యూటరుగా పనిచేసినా, ఎంత ఆబ్జెక్టివ్‌గా ఈ సంపాదకీయం రాశాడో పాఠకులకు సులభంగా బోధపడుతుంది. నరసయ్య వెంకటగిరి జమిందారి రైతుల సంక్షేమాన్ని గురించి ప్రత్యేకంగా ఈ వ్యాసంలో ప్రస్తావించడం గమనార్హమైనది. ఈ వ్యాసానికి సంగ్రహానువాదం :

“కొంతకాలం క్రితం విజయనగరం మహారాజా వైస్ రీగల్ కౌన్సిలు (Vice Regal Council) కు నియమించబడడం వల్ల, మద్రాసు ప్రెసిడెన్సీ కౌన్సిల్లో ఏర్పడిన ఖాళీని పూరించడానికి స్థానిక పత్రికల్లో కొన్ని పేర్లు సూచించబడ్డాయి. ఈ గౌరవానికి వెంకటగిరి జమిందారు రాజా రాజగోపాలకృష్ణ యాచేంద్ర పాత్రుడయ్యాడని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. సంస్కారవంతుడైన ఈ 32 ఏళ్ళ యువకునితో మాకు చాలాకాలంగా పరిచయం ఉంది. ఈయన మద్రాసులో ఎక్కువ రోజులు ఉండకపోయినా, తనతమ్ముడు బొబ్బిలి జమీందారులాగా తనకు మార్షు వంటి గొప్ప ఇంగ్లీషు ట్యూటర్లవద్ద విద్యాభ్యాసం చేసే అవకాశం లేకపోయినా, ఇంగ్లీషు చక్కగా అర్థంచేసుకొని, యాస లేకుండా మాట్లాడగలడు. ఇది చాలా గొప్ప విషయం. ఇంగ్లీషువారి పరిపాలనలో, ఇంగ్లీషు