పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

91


పరిష్కారాలు, ప్రభుత్వానికి అందుతాయి. ట్రెవిలియన్ గవర్నరు పదవి చేపట్టకముందు నుంచి కొనసాగుతున్న లంచగొండి విధానానికి, మూస ఆలోచనలకు సరిపడని కొత్తదనం ఈ పద్ధతి ద్వారా ప్రవేశపెట్టబడింది. మొదట్లో ట్రెవిలియన్ సలహాదార్లు, మార్గదర్శకులు ఈ నూతన విధానాన్ని సానుకూలంగా గ్రహించలేదు. ఛార్లెస్ ట్రెవిలియన్ గవర్నరు పదవి చేపట్టకముందే ఒక అనుభవజ్ఞుడైన పౌరుడుగా, న్యాయశాఖలో ఉదార స్వభావంతో బాధ్యతాయుతంగా మెసలుతూ సమకాలికుల కంటే ఎంతో ముందున్నాడు. ఆయన తర్వాత అధికారం చేపట్టిన వారందరూ గ్రాంట్ డఫ్ పరిపాలనలో ఒంటెత్తు పోకడలు రహస్యంగా ప్రవేశించే వరకు, ఆయన నెలకొల్పిన పద్ధతినే ఎంతోకాలం అనుసరిస్తూ వచ్చారు. ఎడిటర్స్ టేబుల్‌కు అందించే సమాచారంలో విషయమేమీ ఉండేదికాదని గ్రాంట్ డఫ్ పరిపాలన మీద అభియోగం ఉండేది. అరుదుగా మాత్రమే ఆసక్తి గలిగించే సమాచారం ఉండేది. ఏవో కొన్ని పరిపాలనా నివేదికలు తప్ప, రహస్యంగా సేకరించిన వార్తలో, క్లబ్ ముచ్చట్లలో చెవినబడినవో, బజారు వీధుల్లో అనుకొనేవో తప్ప పత్రికలకు రాయడానికి విషయమేమీ ఉండేది కాదు. రహస్యంగా ఉంచాల్సిన అవసరంలేని పరిపాలనా సంబంధమైన సమస్త నివేదికలు జిల్లా మాన్యువళ్ళు, ఉపయోగకరమైన -- సమాచారం స్థానిక పత్రికలకు అందించాలనేది మొదట ఏర్పరచిన నిబంధన. ఈ సమాచారం ఏఏ పత్రికలకు అందజేయాలో ఆ పత్రికల జాబితా గూడా తయారు చేయబడింది. ఈ విధంగా గుర్తింపు పొందిన పత్రికలలో పీపుల్స్ ఫ్రెండ్ ఉంది. ఆ పత్రికలతో బాటు పీపుల్స్ ఫ్రెండ్ కూడా సౌకర్యాలన్నీ అనుభవిస్తూ వచ్చింది. ఈ , నిబంధనవల్ల స్థానిక పత్రికా రచనకు అన్ని రిపోర్టులూ అందుబాటులో ఉండేవి. విమర్శించడానికి, సలహాలివ్వడానికి, అవసరమైన భోగట్టా పత్రికలకందేది.

ఇప్పుడు ప్రధాన సెక్రెటేరియట్ (Chief Secretariat) ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఏఏ పత్రికలకు ఈ నివేదికలు, మాన్యువళ్ళు ఉచితంగా ఇవ్వాలో, ఏ పత్రికలు వాటికి ధర చెల్లించి తీసుకోవాలో తీర్మానించడానికి తానే న్యాయ నిర్ణేత అయింది. ప్రతిఫలాపేక్ష లేకుండా, వివక్ష లేకుండా అన్ని పత్రికలకూ అందజేయాలని ట్రెవిలియన్ ప్రవేశపెట్టిన ఈ పద్దతి నుంచి వైదొలగడానికి కారణం కనిపించదు. పైన పేర్కొన్న విస్తృతమైన నివేదికలను ప్రభుత్వం తన ముద్రణాలయంలో అచ్చు వేస్తుంది. ఈ సంపుటాలను అమ్మి డబ్బు చేసుకోవడం ప్రభుత్వ ధ్యేయం కాదు. ప్రెసిడెన్సీలో ఏ కార్యక్రమం చేపట్టిందీ, ఏమి చేయబోతున్నది ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలకు ఉపయోగపడే ఆసక్తికరమైన సమాచారం అందరికీ వివరించడానికి ఈ విధానం ప్రవేశపెట్టబడింది. ఛార్లెస్ ట్రెవిలియన్ ఉద్దేశించినట్లు కొన్ని పత్రికలకు రిపోర్టులు అందుతున్నాయి. ఇతర పత్రికలు కాపీ కావాలని కోరితే డబ్బు పెట్టి కొనుక్కోమని ఆర్డరు జారీ చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వానికీ, పీపుల్స్ ఫ్రెండ్ కూ మధ్య సంబంధాలనుబట్టే