పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

దంపూరు నరసయ్య


the order.

చివరకు పీపుల్స్ ఫ్రెండ్‌కు ప్రభుత్వ ప్రచురణలు ఉచితంగా పంపనవసరం లేదంటూ ఈ ఆర్డరు జారీచేయబడింది.

NOTE-3 - FINAL ORDER

"The People's Friend", will, as already ordered, be supplied with such Govt. publications as are placed on the Editors' Table as regards reports and such publications; the general rule is that these are only given on payment, the government see no reason for making an exception in the case of the journal in question.

4. మద్రాసు ప్రభుత్వం - పత్రికలు

పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకీయానికి ప్రభుత్వం ఈ సమాధానంతో స్పందించింది. ప్రజాభిప్రాయాన్ని, పత్రికల అభిప్రాయాన్ని లెక్కపెట్టమని నిస్సిగ్గుగా చెప్పిన సమాధానం ఇది. ప్రభుత్వంలోని ఉన్నతోద్యోగుల పొగరు బోతుతనం, దాష్టీకం, ప్రజాపక్షం వహించిన పత్రికలమీద వారికున్న చిన్నచూపు అన్నీ ఈ ఉదంతంవల్ల స్పష్టమవుతున్నాయి.

భారతీయ ఇంగ్లీషు పత్రికలు బ్రిటిష్ అధికారులతో తరచు పోరాడవలసి వచ్చింది. ప్రభుత్వ పక్షపాత చర్యలను నిర్భయంగా, నిర్మొహమాటంగా నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకీయాల్లో విమర్శించేవాడు. పత్రికారచనలో ఆయన పాటించిన ప్రమాణాలకు, ప్రదర్శించిన ఆత్మాభిమానానికి ఈ సంపాదకీయం నిదర్శనంగా నిలుస్తుంది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద ప్రభుత్వాధికారులు అల్పబుద్దితో ఎంత విచక్షణారహితంగా ప్రవర్తించేవారో ఈ వ్యాసం తెలియజేస్తుంది. సర్ గ్రాంట్ డఫ్ (Sir Grant Duff) మద్రాసు గవర్నరు అయిన తర్వాత పత్రికల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన తీరును ఈ సంపాదకీయం బట్టబయలు చేస్తుంది. అధికారులకు ఇంత కోపం తెప్పించిన సంపాదకీయానికి అనువాదం :

“షుమారు ముప్పై ఏళ్ళ క్రితం ఈ ప్రెసిడెన్సీ గవర్నరుగా ఉండిన సర్ ఛార్లెస్ ట్రెవిలియన్ తన సహజ రాజకీయ కౌశలంతో మొదటిసారిగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడు. గోప్యంగా ఉంచనవసరం లేని సమాచారాన్ని, 'రహస్యం' పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లో నిగూఢంగా ఉంచుతున్న సమాచారాన్ని, 'ఎడిటర్స్ టేబుల్' ముందు ఉంచి స్థానిక పత్రికలకు అందుబాటులో ఉండేటట్లు చేశాడు. దీనివల్ల బహిరంగ చర్చ కొనసాగుతుంది. తమ ఏలుబడిలో ఉన్న దేశాభివృద్ధికి అవసరమైన సలహాలు,