Jump to content

పుట:Endaro Wikimedianlu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంరక్షకుడు

నిర్వాహకుడిగా, చురుకైన వాడుకరిగా అందరికీ తలలో నాలుక లాగా మెలుగుతూ తెవికీ అభివృద్ధిలో తన ముద్ర వేసిన వాడు కాసుబాబు. 2006 నుండి 2012 వరకు తెవికీలో చాలా చురుగ్గా ఉంటూ విస్తారమైన కృషి చేసారు కాసుబాబు. తెవికీలో పలు విధానాలు మార్గదర్శకాలను ఏర్పరచుకున్న దశ అది. తోటి నిర్వాహకులు వాడుకరులతో కలిసి తెవికీకి ఒక దిశను ఏర్పరచడంలో కాసుబాబు ముఖ్య పాత్ర వహించాడు. వారందరూ వేసిన పునాదుల పైనే ఆ తరువాత తెవికీ భవనం కట్టారు.

వ్యాసాల్లో జరుగుతున్న మార్పులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేసేవాడు. అందరికీ తలలో నాలుకలా ఉంటూ నిర్వాహణ చక్కబెట్టేవాడు. ఒక గృహిణి పిల్లల చదువు దగ్గర్నుండి కరెంటు బిల్లులు కట్టేదాకా అన్నీ తానై చూసుకుంటూ, చేసుకుంటూ ఇంటిని ఎలా దిద్దుకుంటుందో వికీని అలా చూసుకునేవారు కాసుబాబు గారు.

అవసరమైనపుడు అనుభవజ్ఞులైన వాడుకరులకు కూడా దిశానిర్దేశం చేస్తూ వ్యాసాలను రూపుదిద్దడంలో పాత్ర పోషించేవారు. మొదటిపేజీలో ముఖ్య భాగమైన ఈ వారం వ్యాసం శీర్షికను ఐదేళ్ళకు పైగా నిర్వహించాడు. ఈ శీర్షికలో ప్రకటించే ముందు ఎంచుకున్న వ్యాసంలో చెయ్యాల్సిన సవరణలను చేసి, సిద్ధం చేసి ఉంచేవాడు.

ఐదేళ్ళుగా నిర్విరామంగా ఈ పని చేస్తూనే ఉన్నారు, అభ్యంతరం లేకపోతే మీరు ఇతర పనుల మీద దృష్టి పెట్టండి, మీకూ మార్పు ఉంటుంది అని ఇతర పెద్దలు ఆప్యాయంగా సలహా వచ్చేంతవరకూ మా కాజ సుధాకరబాబుకు

ఎందరో వికీమీడియన్లు

27