పుట:Ecchini-Kumari1919.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

ఇచ్చి నీ కు మారి

యిచ్ఛినీకుమారి ముఖచంద్రదర్శనము గల్గును. ఎప్పుడు నామనోరథము లీడేరు ననువిచారము తప్ప భీమునకు వే ఱాలోచన మేమియును లేదు. ముందుముందు జరుగఁబోవు కార్యములను గూర్చి మనస్సులో నేనేమియో యోజించుకొనుచు బాహ్యప్రపంచమును మఱచియుండెను. అప్పు డమరసింహుఁ డొకపురుషునితోఁ గూడ నచ్చటికి వచ్చి భీమదేవునకు నమస్కరించెను. ఆరా జతనిని విశేషముగా నాదరించి కూర్చుండనియమించి 'ఆరెండవపురుషుఁ డెవడని యడుగ మీ పినతండ్రికుమారుఁడు గోకులదాసని యమరసింహుడు ప్రత్యుత్తర మిచ్చెను, అది విని భీముఁ డానందముతోను, నాదరముతోను లేచి సోదరుని గౌఁగిలించుకొని యొకయాసనమునఁ గూర్చుండఁబెట్టి 'సోదరా! మీతండ్రి సారంగదేవుఁ డన్యాయముగా నొకసామంతరాజును జంపుటచేతను, నతఁడు నేను జెప్పినట్లు నడవకపోవుటచేతను మాయాగ్రహమునకుఁ బాత్రుఁ డయ్యెను, అన్యాయప్రవర్తకుని రాజ్యమందుండనిచ్చిన ప్రజానురాగమునకు భంగముకలుగునేమో యని భయపడి యతనిని దూరముగాఁ బంపింపవలసివచ్చెను. అట్లు చేసిన తరువాతనైనను మీతండ్రి పశ్చాత్తాపమునొంది యనుకూలముగా ప్రవర్తించిన నింతవఱకును రాకపోయి యుండును. కాని, సమీపగ్రామాదులను కొల్లగొట్టి నా రాజ్యమునకును, నాకును స్వస్థత గలుగనీయక మఱింత

-