పుట:Ecchini-Kumari1919.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము 17

91



దెల్ల వాఱుజామున మధుమంతమునుండి బయలు దేజితిమి. వీనికిని, నాకును నిదివఱకు బరిచయము లేదు.మార్గముసాగి వచ్చుచు భార్యతో వీఁ డొనర్చిన సంభాషణమువలన నాకుఁ గొంచెము సందియముగల్గినది. ఆసం దేహమును దీర్చుకొను వీనిని వెంబడించితిని, నాసం దేహము తీరినది. నాకోర్కి ఫలించినది' అని పలికి మిత్రునిసాయముననా మొదటి వానిని బంధించి వీనిని సవారీలోఁ బడ వేసి రహ స్యముగా మాయూరికిఁ బంపుమని చెప్పి వెడలిపోయెను. ఆగృహస్థుఁడు మిత్రుఁడు చెప్పినట్లు చేసెను. ట కే యీదిన మెల్ల

పదు నేడవ ప్రకరణము

భీమ దేవుని పశ్చాత్తాపము

పండు వెన్నెలలు జగమునునిండించుచున్న సమయ మున మలయమారుతము ప్రసరించు తావున నా సౌధోపరి భాగమునందు భీమ దేవుఁ డాసనాసీనుఁడై యుండెను. ఇచ్ఛినీకుమారిని వరింపన లెనన్న కోర్కి యతనిమనస్సున నతిశయించి చెప్పఁదరముగాని వ్యథలఁ బెట్టుచుండెను. సంతత విచారముచే నా రాజు మిగులఁ గృశించియుండెను. ఎన్ని శైత్యోపచారములు చేసినను , నతని దేహ మగ్ని హోత్ర పుంజమువ లె స్పృశింపఁ దరముగాకుం డెను, ఎప్పు డాబూ దుర్గమును ముట్టడింతును, ఎప్పుడు సౌందర్య దేవతన లెనున్న