పుట:Ecchini-Kumari1919.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 16

89

నాహారము దిన్నవాడగుట చేతనో రెండవ బాటసారికూడ నిప్పుడు మొదటివానివ లెనే సంతోషమున వరింపఁదొడఁ గెను. మొదటివాఁడు మాటిమాటికిని బహుమానము నే తలంచుకొనుచు నిజముగాఁ దనవంటి బీదవాని కొక్క మా రింత దన్యము లభించుట గొప్ప యదృష్టమనియు నా ధన ముతోఁ దనకోర్కెలును, దన భార్య కోర్కెలును గూడ ఫలింపఁ జేసికొనవచ్చుననియు నేమయినను నా ధనముతో ముందుగాఁ దగిన గృహము నొక దానిని గట్టనలయుననియు నిట్లు మనోరథపరంపరలచే నాకాశమున నొక హర్మ్యముఁ గట్టుకొని యందు విహరించుచుండుట చే వాని సంతోషమును గూర్చి వర్ణింప నవసర మే లేదు.

వా రట్లు పోవఁగాఁ బోవఁగా నొకమహారణ్యము తారసిల్లెను. వారు దానిని దాఁటి పోవలసియున్నది. అపుడు రెండవవాఁడు ప్రథమునితో 'ఓయీ '! సాయంసమయము గావచ్చినది,మనముగూడ మిక్కిలి బడలిక చెందియున్నాము. ముందు మార్గము కంటక శిలామయమై, క్రూరమృగములకు నిలయములగు నరణ్యములచే నావృతమై యెట్టివానికై నను భయము పుట్టింపక పోదు. ఇట్టితతి నీయరణ్యములోనుండి పోవ నెంచుట మహా ప్రమాదకరము. అదిగో! నా కానవచ్చు గ్రామమున - నా స్నేహితుఁ డున్నాఁడు. వాడు మిక్కిలి మంచివాడు. మనలను జక్కఁగా నాదరించును. ఈ రాత్రి యక్కడ నిలిచి యచట భుజించి నిద్రించి తెల్ల వాజు జామున