పుట:Ecchini-Kumari1919.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

ఇచ్చి నీ కు మారి

ఆమె యిదివఱలో సౌందర్యము చేతనే నన్ను లోఁగొన్నది. ఇప్పుడు ధనుర్విద్యచేఁగూడ వశపఱుచుకొన్నది. ఆహా! ఏమి నేర్పు! ఎంతబలము! ఆమెబాణ మాపంది హృదయమును జీల్చినట్లు మన్మథుఁడు తనబాణములచే నాహృదయమును జీల్చుచున్నాఁ' డని పలికి యాబాణము నత్యాదరముతోఁ దనయొద్ద నుంచుకొనెను.

రెండవప్రకరణము

ఆబూగడము

హిందూదేశమున సుప్రసిద్ధిగాంచినపర్వతములలో నాబూపర్వత మొకటి. రాజపుత్రస్థానమున నుత్తరదక్షిణదిశలకుఁ బెట్టఁబడినగోడవలె వెలయు నారావళీపర్వతమాలికలో నొకభాగమేయైనను, ఈపర్వతము కేవలము దానితో జేరియుండక కొంచెము వేఱుపడియున్నది. అది రాజస్థానమునఁగల కొండలన్నిటికంటెను మిక్కిలి యున్నతమైనది దాని శిఖరములన్నిటిలోను గురుశిఖరము మిగుల నెత్తైనది. గురుశిఖరముపొడువు 5668 అడుగులు, ఆగిరియందుఁ బ్రశస్తమైన జలకుండలములును, మిగులఁ జక్కనిగుహలును, నానావిధఫలవృక్షములును గలవు. ఇట్టి సదుపాయము లుండుటచే నెల్లవారికిని వాసయోగ్యమై యానందదాయకమై యున్నది.