పుట:Ecchini-Kumari1919.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ఇచ్చినీ కుమారి

గావించి అంతఁ బరమారుఁ డభయసింగునకు వార పంప నతఁడు రాత్రినుండియు నింటికి రాలేదని యచటివారు చెప్పిరి. ఇవన్నియు ముడి వేసి చూడఁగా రాజకుమారియు రూపవతియు నభయసింగును గలసి యెచ్చటికో పాఱిపోయి యుందురని తో పక పోదు. మఱియు నభయసింగు సర్వదా రూపనతి నాశ్రయించుటచేఁ జతురు రాలగు నాయువతి రాజకుమారి కభయసింగునం దనురాగము గల్గించి వారికిఁ బెండ్లి పరమారునివలన భయముచే నెక్కడికో పాఱిపోయిరనికూడఁ దట్టక మానదు. కాని, యా యూహ విశ్వాసార్హము కాదు, అభయసింగు జనప్రియుఁడు, గుణవంతుఁడు, వి శేషించి రాజు నకు మేనల్లుఁడు, రాజ గౌరవమునకుఁ బాత్రుఁడు. ఇట్టివానిని రాజకుమారి వరించిన చో రాజు సంతోషించు గాని యామెను గోపింపఁడు. జై తుఁడు తనసోదరికిఁ జెప్పిన సమాధానము నాలోచింప నీయంశము తెల్లము కాక మానదు. ఇట్లుండ నామెకుఁ బురమును విడిచి పోవలసినంత యవసర మేమి? మఱియు, నిచ్ఛిని ప్రవర్తన మరసిన వా రామె యంత సాహసము పూనునని తలంపరు.

ఇట్లెంత సేపు గూర్చుండి యాలోచించినను రాజ కుమారి యేమయినదో వారికి బోధపడ లేదు. జై తపరమారుఁడు చిరకాలము దుఃఖించి యెట్ట కేలకు ధైర్యమవలం బించి వేఁడినిట్టూర్పులు దందడింప నచ్చటి వారిని 'మంత్రులారా ! హితులారా ! సేవకులారా ! మాయిచ్చిని