పుట:Ecchini-Kumari1919.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 15

83


గాదు. రాజకుమారి యచ లేశ్వరునిఁ జూడఁబోవుచున్నది. అందులకై యీసవారిని గొనిపోవుచున్నాను. ఈవృత్తాంత మెవ్వరి తోను జెప్పవల దని రాకుమారి కోరుచున్నదని చెప్పి రూపవతి లోనికిఁ బోయెను. కొంత సేపటికి సవారీలోఁ గూర్చుండి రాజకుమారి స్వామి దర్శనార్థ మరి గెను. కాని, యామె మరల సవారితోఁ గొలఁది కాలములో నే యంతఃపురమునకు వచ్చెను. ఇంతకుఁ దప్ప మా కేమియుఁ దెలియదు.” 'సవారితో మరలివచ్చిన చో రాకుమారి యేల కన్ప వారి సందియము. అంత నొక పరిచారకుఁడు. యుచ లేశ్వరస్వామి యర్చకుని దీసికొనివచ్చెను, అతఁడు రాజును సమీపించి నమస్కరించి యుచి తాసనమునఁ గూర్చుండెను. అపుడు బెదరుచున్న చిత్త ముతో రాజా విషయ యమై యతని నడుగఁగా నాపూజారి చేతులు జోడించి మహా ప్రభూ ! నిన్న యభయసింగు వచ్చి 'ఈ రాత్రి రాజకుమారి స్వామి దర్శనార్థము వచ్చును గాన మఱికొంత సేపు వేచి యుండు' మని నాతోఁ జెప్పెను. నే నట్లే వేచియుంటిని. రాత్రి రెండవయామము ముగియుచుండ రాజకుమారి యాల యమునకు నచ్చినది. ఒక చెలికత్తెయు, నభయసింహుఁడును నా మెతో వచ్చిన ట్లున్నది. ఆమె స్వామిని దర్శించి ప్రసా దమును స్వీకరించి సవారీలోఁ గూర్చుండి యింటికి మరలి వ చ్చెను. ఇంతకంటె నా కేమియును దెలియ దని మనవిచేసి కొనెను.