పుట:Ecchini-Kumari1919.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము 15 79


యున్నాడు. కావున, నా మాట వినుఁడు; ఈ రాజును విడు వుఁడు ' అని నచ్చఁ జెప్పి వారిలోఁ బెద్దవాఁడగు గోకుల దాసును దనతోఁగూడ నంహిలపురమునకుఁ గొనిపోయెను.

పదు నై ద ప ప్ర క ర ణ ము

అన్వే ష ణ ము

దాసీజనము వాడుక చొప్పునఁ బ్రాతఃకాలమున నేవచ్చి కన్యాంతఃపురమునఁ బనులు చక్కబెట్టుకొనిరి. ఇచ్చినీ కుమారిపడకటింటి తలుపు బంధింపఁబడి యుండెను. ఎల్లప్పుడును దమకంటే ముందుగానే మేల్కనియుడు రాజకుమారి నాఁ డంత సేపేల నిద్రించుచున్నదో వారికి బోధపడ లేదు. రాత్రి చాల భాగము వఱకును మేల్కనియుండుట చే నామె యింక ను నిద్రవోవుచుండ వచ్చు నని నా రెట్లో మనస్సమాధానము చేసికొని యామెనిమిత్త మచ్చటనే వేచియుండిరి.రాజ కుమారి. మేల్కోనునంతవఱకును దాసీజన మామేశయన - గృహమును బ్రవేశించు వాడుక లేదు. అందుచే నాగృహ మును ప్రవేశింప నెవ్వరు సాహసింపరయిరి. వనులన్నియు నెఱు వేర్చుకొన్న వా రగుట చే నచ్చటచ్చటఁ గూర్చుండి యేమియో ప్రసంగించు కొనుచుండిరి. క్రమముగా సూర్య భగవానుఁడు' తనకిరణజాలమును లోకము పై బాసరింపఁ జేయుచు గగన సౌధము నెక్కి వచ్చుచుండెను. కాని, యిచ్ఛిని